వ్యక్తిగా వచ్చి వ్యవస్థగా మారాడు జగన్..

ఐదో రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం మార్షల్స్, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ..నిన్న సభలో ఆందోళన వ్యక్తం చేయగా, అధికార వైసీపీ వారి ఆరోపణలను కొట్టిపారేసింది.  ఈ రోజు అసెంబ్లీ ప్రారంభమవ్వగానే మంత్రి పేర్ని నాని ప్రసంగించారు. గురువారం టీడీపీ నేతలే మార్షల్ష్స్‌పై దాడి చేశారని, ఆధారాలతో కూడిన కొన్ని ఫోటోగ్రాప్స్‌ను  స్పీకర్‌కు మంత్రి సమర్పించారు. కాగా దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు […]

  • Ram Naramaneni
  • Publish Date - 9:41 am, Fri, 13 December 19
వ్యక్తిగా వచ్చి వ్యవస్థగా మారాడు జగన్..

ఐదో రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం మార్షల్స్, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ..నిన్న సభలో ఆందోళన వ్యక్తం చేయగా, అధికార వైసీపీ వారి ఆరోపణలను కొట్టిపారేసింది.  ఈ రోజు అసెంబ్లీ ప్రారంభమవ్వగానే మంత్రి పేర్ని నాని ప్రసంగించారు. గురువారం టీడీపీ నేతలే మార్షల్ష్స్‌పై దాడి చేశారని, ఆధారాలతో కూడిన కొన్ని ఫోటోగ్రాప్స్‌ను  స్పీకర్‌కు మంత్రి సమర్పించారు. కాగా దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్‌ను కోరారు.

ఆ తర్వాత మాట్లాడిన టీడీపీ శాసనసభ్యుడు రామానాయుడు మాట్లాడుతూ మార్షల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో నడుచుకునే విధానం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారని కూడా చూడలేదని..వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రామానాయుడు స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా తనను డ్రామా నాయుడు అంటున్నారని, తానేం 16 నెలలు జైల్లో లేనని, చిప్పకూడు తినలేదని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

కాగా రామానాయుడు వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటరిచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు సెపరేట్ మార్గముంటుందని, సీఎం వచ్చే మార్గంలో ఆయన రావడానికి వీలుంటుందని తెలిపారు. రోజూ వచ్చే రూట్‌లో రాకుండా రోడ్డుపై దిగి ఉద్దేశ్యపూర్వకంగా ప్లేకార్డ్స్, బ్యానర్స్‌తో వస్తే..అసెంబ్లీకి రానిస్తారా అని ప్రశ్నించారు. ఇక  కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం వల్లే జగన్‌ను జైలులో దిగ్భందించారని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రజలు జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఇప్పుడు 151 సీట్లతో సీఎంగా ఎదిగారని పేర్కొన్నారు. తక్కువ వయసులో ఒక వ్యవస్థగా మారిన వ్యక్తి జగన్ అని కొడాలి నాని కొనియాడారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్ వైపు ఉన్నారని, సిగ్గులేని టీడీపీ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం గురించి మాట్లాడేముందు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని మంత్రి కొడాలి హెచ్చరించారు.