కమ్మ సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు మీద మరోసారి బుసలు కొట్టారు వైసీపీ నేత.. ఏపీ మంత్రి కొడాలి నాని. కేవలం కమ్మవారి గురించి మాత్రమే కలవరిస్తూ.. అందులోనూ తనకి చందాలిచ్చిన కమ్మవారిని మాత్రమే..

కమ్మ సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు
Follow us

|

Updated on: Aug 25, 2020 | 5:20 PM

టీడీపీ అధినేత చంద్రబాబు మీద మరోసారి బుసలు కొట్టారు వైసీపీ నేత.. ఏపీ మంత్రి కొడాలి నాని. కేవలం కమ్మవారి గురించి మాత్రమే కలవరిస్తూ.. అందులోనూ తనకి చందాలిచ్చిన కమ్మవారిని మాత్రమే వెనుకేసుకొస్తూ బాబు కమ్మసంఘం అధ్యక్షుడిగా మారిపోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మిగతా వారి విషయంలో నానా యాగీ చేసే బాబు.. కమ్మవారిని మాత్రం వెనకేసుకు రావడం సరికాదన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సమయంలో విదేశీ కంపెనీ వ్యక్తులు గ్యాస్ లీక్ చేశారని, వారిని అరెస్ట్ చేయాలని గింజుకున్న బాబుకి రమేష్ హాస్పిటల్స్ వ్యవహారంలో ఎందుకు నోరు పడిపోయిందని అన్నారు.

చంద్రబాబు సలహాలు వినే డాక్టర్ రమేష్ ఎంక్వయిరీకి రాకుండా పారిపోయారన్నారు. అల్జీమర్స్ వల్ల చంద్రబాబుకి మైండ్ దొబ్బిందంటూ మరోసారి చాకిరేపు పెట్టారు. విజయవాడలో రమేష్ హాస్పిటల్స్ ఘటనలో ప్రమాదానికి గురైన బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం నాని ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ రమేష్ బాబుని కాపాడేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, పోలీసులకు చిక్కకుండా పారిపోయిన ఆయనకు ఓ మాజీ ముఖ్యమంత్రి ఆశ్రయం ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు మాయమాటలు రామ్ వినకుండా ఉంటే మంచిదని గతంలో అనేక మంది సినిమా వాళ్లని చంద్రబాబు వాడుకుని వదిలేశారంటూ సినీ హీరోకు సలహా ఇచ్చారు కొడాలి.