కృష్ణా జిల్లా : సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మినిస్టర్ నాని

కొడాలి నాని..కృష్ణా జిల్లాలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత. పార్టీ ఏదైనా భారీ మెజార్టీతో గెలవడం నానికి వెన్నతో పెట్టిన విద్య. అన్న నందమూరి తారకరామారావు సొంత నియోజకవర్గం గుడివాడలో.. గత నాలుగు టర్మ్స్‌లో..పార్టీతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్‌తో గెలుస్తూ వస్తున్నాడు నాని. ఏ పార్టీలో ఉన్నా ప్రజల తరుపున లాయల్‌గా పోరాడటం నానికి అలవాటు. అదే ఆయన్ను శ్రీరామరక్షగా కాపాడుతూ వస్తుంది.  అంతేకాదు..తాను నమ్మిన నాయకుడు ఎవరైనా సరే…ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీకి […]

కృష్ణా జిల్లా : సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మినిస్టర్ నాని
Follow us

|

Updated on: Nov 12, 2019 | 5:58 AM

కొడాలి నాని..కృష్ణా జిల్లాలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత. పార్టీ ఏదైనా భారీ మెజార్టీతో గెలవడం నానికి వెన్నతో పెట్టిన విద్య. అన్న నందమూరి తారకరామారావు సొంత నియోజకవర్గం గుడివాడలో.. గత నాలుగు టర్మ్స్‌లో..పార్టీతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్‌తో గెలుస్తూ వస్తున్నాడు నాని. ఏ పార్టీలో ఉన్నా ప్రజల తరుపున లాయల్‌గా పోరాడటం నానికి అలవాటు. అదే ఆయన్ను శ్రీరామరక్షగా కాపాడుతూ వస్తుంది.  అంతేకాదు..తాను నమ్మిన నాయకుడు ఎవరైనా సరే…ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీకి సేవ చేస్తాడు నాని. టీడీపీలో ఉన్న సమయంలో గ్రూపు రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ ఈ మాస్ లీడర్..వైసీపీలో చేరి..అక్కడ కూడా తన మార్క్ ఇమేజ్‌ను చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన సొంత కమ్యూనిటికీ క‌ృష్ణా జిల్లాలో..ట్రబుల్  షూటర్‌గా మారాడు. నాని సొంత సామాజికవర్గం నేతలు ఎవరైనా సరే..ఏదైనా పని కావాలంటే ఆయన దగ్గరికే పరుగులు పెడుతున్నారట

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో.. చంద్రబాబు అండ్ ఫ్యామిలీపై ఏమాత్రం బెరుకు లేకుండా విమర్శలు చేస్తూ..జగన్ ఇమేజ్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు నాని. అందుకే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి విడుత మంత్రివర్గంలోనే నానికి చోటు కల్పించాడు సీఎం జగన్. వాస్తవానికి కృష్టాజిల్లాలో టీడీపీకి మంచి క్యాడర్‌తో పాటు బలమైన నాయకత్వం కూడా ఉంది. అక్కడ ఉన్న చాలామంది నాయకులు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చక్రం తిప్పారు. దేవినేని ఉమా, కేశినేని నాని, గద్దే రామ్మెహన్ లాంటి నేతలు జిల్లాపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. ఎవరికి వారే గ్రూపులు ఏర్పాటు చేసుకోని చంద్రబాబు దగ్గర మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. వీరందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఇప్పటికి వీరు  టీడీపీలో కొనసాగుతున్నారు.

ఈ నేపథ్యంలో..వైసీపీ అధికారంలోకి వచ్చాక నాని.. సివిల్ సప్లైస్ మినిస్టర్‌గా పదవిని చేపట్టారు. దీంతో అప్పటివరకు టీడీపీ నాయకులకు సపోర్ట్ చేసిన ద్వితీయ శ్రేణి నేతలంతా నాని ఇంటికి క్యూ కట్టారంట. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్న చంద్రబాబు సామాజికవర్గం నేతలంతా..ప్రభుత్వం తరుఫున ఏదైనా అవసరం ఉంటే మినిస్టర్ నానినే అప్రోచ్ అవుతున్నారని సమాచారం. నాని కూడా.. కాదు, అవ్వదు అని చెప్పకుండా..జగన్‌ని నమ్ముకుంటే ఎప్పటికైనా విశ్వసనీయత ఉంటుందని..బాబును  నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని హితబోధ చేస్తూ..వారికి కావాల్సిన పనులను చక్కదిద్దుతున్నారట. ఇలా చంద్రబాబు సామాజికవర్గం బలంగా ఉంటే కృష్టాజిల్లాలో టీడీపీని..బలహీనం చెయ్యడానికి నాని చెప్తున్న మాటలు బాగా పనిచేస్తున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.