సంపూ “కొబ్బరిమట్ట” ట్రైలర్ వచ్చేసిందిగా..

Kobbari Matta Movie Traile Longest Single Shot Dialogue, సంపూ “కొబ్బరిమట్ట” ట్రైలర్ వచ్చేసిందిగా..

హృదయ కాలేయం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు.. తనదైన శైలిలో నెట్టుకొస్తున్నాడు. ఆ మధ్యలో సింగం 123, వైరస్ లాంటి మూవీలతో నేనున్నాను అనిపించాడు. అయితే అవేమీ అనుకున్నంతగా హిట్ అయిన దాఖలాలు కనిపించలేదు. హృదయ కాలేయంతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సంపూ.. ఆతర్వాత వచ్చిన మూవీస్‌లో తన గ్రాఫ్‌ నిలుపుకోలేకపోయాడు. తాజాగా కొబ్బరిమట్ట సినిమాతో మరోసారి సంచలనం రేపేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీని రూపస్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

కొబ్బరిమట్టకు ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రెండేళ్ల క్రితం నుంచి ఈమూవీ కోసం సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఇప్పుడు వైరల్‌గా మారి సంచలనం స‌ృష్టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *