మీ ఫోన్ పోయిందా.. అప్పుడు మీ “వాట్సప్” మిస్ యూజ్ కాకుండా ఉండాలంటే..?

స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు సగటు మనిషి దగ్గర దాదాపుగా ఉంటుంది. అయితే ఈ ఫోన్‌లో అనేక రకాల యాప్‌లు మనం ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించిన అనేక యాప్స్‌ ఉపయోగిస్తుంటాం. అందులో వాట్సప్ అతి ముఖ్యమైనది. అయితే ఇందులో చాలామంది దీంట్లో వ్యక్తిగత సంభాషణను అలానే నిక్షిప్తం చేసిపెట్టుకుంటారు. అయితే సడన్‌గా స్మార్ట్ ఫోన్ పోయినప్పుడు.. లేదా చోరీ జరిగినప్పుడు.. ఈ వాట్సప్ యాప్ మిస్ యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది […]

మీ ఫోన్ పోయిందా.. అప్పుడు మీ వాట్సప్ మిస్ యూజ్ కాకుండా ఉండాలంటే..?
Follow us

| Edited By:

Updated on: Dec 17, 2019 | 6:08 AM

స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు సగటు మనిషి దగ్గర దాదాపుగా ఉంటుంది. అయితే ఈ ఫోన్‌లో అనేక రకాల యాప్‌లు మనం ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించిన అనేక యాప్స్‌ ఉపయోగిస్తుంటాం. అందులో వాట్సప్ అతి ముఖ్యమైనది. అయితే ఇందులో చాలామంది దీంట్లో వ్యక్తిగత సంభాషణను అలానే నిక్షిప్తం చేసిపెట్టుకుంటారు. అయితే సడన్‌గా స్మార్ట్ ఫోన్ పోయినప్పుడు.. లేదా చోరీ జరిగినప్పుడు.. ఈ వాట్సప్ యాప్ మిస్ యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చాలా మంది ఫోన్ పోగొట్టుకున్న సమయంలో కంప్టైంట్ కూడా ఇవ్వడానికి వెనుకడుగు వేస్తుంటారు. అయితే సిమ్ బ్లాక్ చేయిస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఆ ఫోన్‌కు సెక్యూరిటీ కోడ్ పెట్టకుండా ఉంటే.. అప్పుడు అందులోని సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వాట్సప్‌కి లాక్ లేకపోతే మీ పర్సనల్‌ మెసేజ్‌లను ఫోన్ దొరికినవారు యాక్సెస్ చేసే ప్రమాదముంది. ఎందుకంటే.. సిమ్ బ్లాక్ చేసినా.. వాట్సప్ వైఫై సహాయంతో యాక్సెస్ చేయవచ్చు. ఈ సమయంలో కంగారుపడకుండా ఆలోచిస్తే.. మీ వాట్సప్‌ను సేఫ్‌గా పెట్టుకోవచ్చు. ఎలాగో చూడండి.

మీ ఫోన్ పోయిన వెంటనే తొలుత సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసి సిమ్ కార్డ్ బ్లాక్ చేయించాలి. ఇలా చేస్తే.. మీ వాట్సప్ అకౌంట్ వెరిఫై చేసే అవకాశం ఉండదు. అయితే వైఫై ఉంటే యాక్సెస్ అవుతుంది కాబట్టి.. వెంటనే బ్లాక్ చేసిన సిమ్ కార్డు.. కొత్తది తీసుకోని.. మళ్లీ వాట్సప్ యాక్టివేట్ చేసుకోవాలి. ఒకవేళ కొత్త సిమ్‌తో మీ వాట్సప్ యాక్టివేట్ చేయాలని ఇష్టంలేకపోతే.. support@whatsapp.com మెయిల్ ఐడీకి ఓ ఇమెయిల్ పంపాలి. ‘Lost/stolen: please deactivate my account’ అనే సబ్జెక్ట్‌తో మెయిల్ పంపాలి. అయితే ఈ క్రమంలో మీ మొబైల్ నెంబర్‌ను ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో.. ఫోన్ నంబర్ ముందు +91 రాయాలి. అప్పుడు మీ వాట్సప్ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది.

అయితే మీ వాట్సప్ డీయాక్టివేట్ అయ్యాక కూడా మరో 30 రోజులపాటు మెసేజ్‌లు వస్తుంటాయి. అవన్నీ అపెండింగ్‌లో ఉంటాయి. ఒకవేళ మీరు మళ్లీ మీ అకౌంట్ రీయాక్టివేట్ చేస్తే.. పెండింగ్‌లో ఉన్న అన్ని మెసెజ్‌లు వస్తాయి. గ్రూప్‌లతో సహా. అయితే 30 రోజుల్లో యాక్టివేట్ చేయకపోతే.. పర్మినెంట్‌గా డిలీట్ అవుతుంది.