Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

ఒక్క మ్యాచ్ గెలిపించాడు.. లెజెండ్‌లతో పోల్చేస్తున్నారు.!

Latest Sports News, ఒక్క మ్యాచ్ గెలిపించాడు.. లెజెండ్‌లతో పోల్చేస్తున్నారు.!

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలవడానికి కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతడు జట్టుకు కావాల్సిన పరుగులు అందించడమే కాకుండా మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టించాడు. ఒక్క బ్యాటింగ్‌లోనే కాదు.. కీపింగ్‌లో కూడా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 52 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇక నెటిజన్లు అప్పుడే రాహుల్‌ని ధోని, రాహుల్ ద్రావిడ్‌లతో పోల్చడం స్టార్ట్ చేసేశారు. అటు ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్‌ను రాహుల్ స్టంపింగ్ చేసిన స్టైల్ అచ్చం ధోని మాదిరి ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉంటే రాహుల్ ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బ్యాట్స్‌మెన్‌లో మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని తర్వాత స్థానంలో నిలిచాడు. అటు లోయర్ ఆర్డర్‌లో 150పైగా స్ట్రైక్​‌రేట్​తో 50కి పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు.

 

View this post on Instagram

 

What a stumping from KL Rahul 🔥

A post shared by Middle stump Cricket (@middle.stump.cric) on

 

View this post on Instagram

 

Take a bow KL Rahul _/\_

A post shared by Middle stump Cricket (@middle.stump.cric) on

 

View this post on Instagram

 

👌👌👌👌👌

A post shared by Epic Cricket Comments (@epic.cricket_comments) on

 

Related Tags