కేఎల్ రాహుల్ నయా ఎఫైర్.. ఆమెతో ప్రేమలో..

Is KL Rahul Dating Akansha Ranjan, కేఎల్ రాహుల్ నయా ఎఫైర్.. ఆమెతో ప్రేమలో..

ఎప్పుడూ ఏదో ఒక విషయంతో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వార్తల్లో నిలుస్తాడు. రాహుల్, హార్దిక్ పాండ్యతో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ టాక్‌షోకి హాజరై.. అమ్మాయిల గురించి అసభ్యకర వ్యాఖ్యల చేయడం.. బీసీసీఐ కొన్ని రోజులు నిషేధం విధించడం జరిగింది. ఇక ఈసారి మరో అమ్మాయి కారణంగా వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం రాహుల్ వెస్టిండీస్‌తో  జరిగే టెస్ట్ సిరీస్ ఆడనున్నాడు.

కెరీర్ ఆరంభం నుంచి రాహుల్ పలు అమ్మాయిలతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. మొదట్లో హీరోయిన్ నిధి అగర్వాల్‌తో రూమర్స్ నడిస్తే.. కొద్దిరోజుల తర్వాత అతియా శెట్టి, సోనమ్ బజ్వా తదితరులతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆకాంక్ష అనే కొత్త అమ్మాయితో రాహుల్ ప్రేమలో పడినట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటి అలియా భట్‌కి స్నేహితురాలైన ఆకాంక్ష, రాహుల్ మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇక ఈ విషయం రాహుల్ వద్ద ప్రస్తావించగా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు సింగిలా..? అని ప్రశ్నించగా.. ‘ఏమో నాకు తెలియదు. నిర్ధారించుకున్న తర్వాత ఖచ్చితంగా మీకే మొదట ఫోన్ చేసి చెబుతానంటూ రాహుల్ తెలివైన సమాధానం ఇచ్చాడు.

 

View this post on Instagram

 

…n i’m so good with that 💛

A post shared by 🦋Kanch (@akansharanjankapoor) on

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *