ముంబాయి ఇండియన్స్‌తో పోరుకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెడీ

క్రికెట్‌లో ఎప్పుడేం జరుగుతుందో... ఏ జట్టు గెలుస్తుందో చెప్పడం చాలా కష్టం.. మంగళవారం జరిగిన మ్యాచ్‌నే తీసుకోండి..! చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓడిపోతుందని ఎవరైనా అనుకున్నారా? అలాగే ఇవాళ ముంబాయి, కోల్‌కతా మధ్య జరగబోయే భీకరపోరుపై కూడా జోస్యం చెప్పడం కుదరని పని.

ముంబాయి ఇండియన్స్‌తో పోరుకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెడీ
Follow us

|

Updated on: Sep 23, 2020 | 1:38 PM

క్రికెట్‌లో ఎప్పుడేం జరుగుతుందో… ఏ జట్టు గెలుస్తుందో చెప్పడం చాలా కష్టం.. మంగళవారం జరిగిన మ్యాచ్‌నే తీసుకోండి..! చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓడిపోతుందని ఎవరైనా అనుకున్నారా? అలాగే ఇవాళ ముంబాయి, కోల్‌కతా మధ్య జరగబోయే భీకరపోరుపై కూడా జోస్యం చెప్పడం కుదరని పని. అబుదాబిలో జరగబోయే ఈ సంగ్రామం కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. నాలుగుసార్లు టైటిల్‌ గెల్చుకున్న ముంబాయి ఇండియన్స్‌ను రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతున్నదంటే ఆ కిక్కే వేరప్పా…! చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబాయి ఇండియన్స్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి బోణి కొట్టాలన్న కసితో ఉంది. కోల్‌కతా ఏం తక్కువ తినలేదు..! అదీ కూడా ఫస్ట్‌ మ్యాచ్‌లో విక్టరీ కొట్టాలన్న పట్టుదలతోనే ఉంది. క్రికెట్‌లో గణాంకాలు వర్క్‌ అవుటవ్వవు కానీ గత రికార్డులను పరికిస్తే మాత్రం ముంబాయికే ఎక్కువ ఛాన్సెస్‌ ఉన్నాయనిపిస్తోంది.. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు పాతిక మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబాయి ఇండియన్స్‌ 16 సార్లు గెలుపొందింది. కోల్‌కతాకు కేవలం ఆరు విజయాలే దక్కాయి. 2014లో అబుదాబిలోనే జరిగిన మ్యాచ్‌లో మాత్రం ముంబాయి ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది. ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ ప్యాట్ కమిన్స్‌ పర్ఫార్మెన్స్‌ ఎలా ఉండబోతుందన్న ఆసక్తే అందరిలోనూ ఉంది. ఎందుకంటే కోల్‌కతా ఇతడిని పదిహేనున్నర కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంది.. మరి అంతేసి డబ్బులు పోసి కొన్నందుకు అందుకు తగిన రాణింపు కూడా ఉండాలిగా! ఇక బ్యాటింగ్‌ విషయానికి వస్తే ఇంగ్లాండ్‌ ప్లేయర్లు మోర్గాన్‌, టామ్‌ బాంటన్‌లు బాగానే రాణిస్తున్నారు. నలుగురు విదేశీ ఆటగాళ్లకే ఫైనల్‌ ఎలెవన్‌లో ఛాన్సు ఉంటుంది కాబట్టి మరి బాంటన్‌ను తీసుకుంటారా? లేక ఆల్‌రౌండర్‌ అయిన సునీల్‌ నరైన్‌వైపు మొగ్గుతారా అన్నది ఆసక్తిగా మారింది. మిడిల్‌ ఆర్డర్‌లో కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ ఉండనే ఉన్నాడు. ఇక ముంబాయి టీమ్‌ కూడా బలంగానే ఉంది.. అయితే తొలి మ్యాచ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రానే ఆశించినట్టుగా రాణించలేకపోయాడు.. మరి ఈ మ్యాచ్‌లో తన రిథమ్‌ను దొరకపుచ్చుకుంటాడా లేదా అన్నది చూడాలి. ట్రెంట్‌బౌల్ట్‌ బౌలింగ్‌ను తప్పుపట్టడానికేమీ లేదు. కృణాల్‌ పాండ్యా, రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ విపరీతంగా పరుగులు సాధించగలిగారు.. ఇదే రోహిత్‌శర్మకు వర్రీగా ఉంది.. తుది జట్టులో పాటిన్సన్‌, కౌల్టర్‌నైన్‌లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్, ఆదిత్య తారే, సౌరభ్‌ తివారి, జస్‌ప్రీత్‌ బుమ్రా, ధవల్‌ కులకర్ణి, జయంత్‌ యాదవ్, సూర్యకుమార్‌ యాదవ్, కృనాల్‌ పాండ్యా, రాహుల్‌ చహర్, హార్దిక్‌ పాండ్యా, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్, మొహసిన్‌ ఖాన్, బల్వంత్‌రాయ్‌ సింగ్, అనుకూల్‌ రాయ్, ఇషాన్‌ కిషన్‌ (భారత ఆటగాళ్లు). క్వింటన్‌ డి కాక్, జేమ్స్‌ ప్యాటిన్సన్, నాథన్‌ కూల్టర్‌ నీల్, ట్రెంట్‌ బౌల్ట్, పొలార్డ్, క్రిస్‌ లిన్, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్, మెక్లీనగన్‌ (విదేశీ ఆటగాళ్లు). కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), శివమ్‌ మావి, సందీప్‌ వారియర్, కుల్దీప్‌ యాదవ్, నిఖిల్‌ నాయక్, సిద్ధార్థ్, ప్రసిధ్‌ కృష్ణ, శుబ్‌మన్‌ గిల్, నితీశ్‌ రాణా, సిద్దేశ్‌ లాడ్, కమలేశ్‌ నాగర్‌కోటి, రింకూ సింగ్, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ త్రిపాఠి (భారత ఆటగాళ్లు). మోర్గాన్, ప్యాట్‌ కమిన్స్, సునీల్‌ నరైన్, రసెల్, లోకీ ఫెర్గూసన్, అలీఖాన్, టామ్‌ బాంటన్, క్రిస్‌ గ్రీన్‌ (విదేశీ ఆటగాళ్లు).

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?