సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్‌కి.. కేకేఆర్ ఇంటికి..

కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబాయి ఇండియన్స్ పైచేయి సాధించి మొదటిస్థానానికి చేరుకుంది. ఆదివారం రాత్రి ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై ముంబాయి ఘన విజయం సాధించింది. ఈ ఒక్క మ్యాచ్‌తో ప్లేఆఫ్స్‌కు చేరుకోవాల్సిన కోల్‌కతా పేలవమైన ఆట తీరుతో ఇంటి ముఖం పట్టింది. దీంతో.. నెట్‌రన్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యాకు దక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా […]

సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్‌కి.. కేకేఆర్ ఇంటికి..
Follow us

| Edited By:

Updated on: May 06, 2019 | 9:29 AM

కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబాయి ఇండియన్స్ పైచేయి సాధించి మొదటిస్థానానికి చేరుకుంది. ఆదివారం రాత్రి ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై ముంబాయి ఘన విజయం సాధించింది. ఈ ఒక్క మ్యాచ్‌తో ప్లేఆఫ్స్‌కు చేరుకోవాల్సిన కోల్‌కతా పేలవమైన ఆట తీరుతో ఇంటి ముఖం పట్టింది. దీంతో.. నెట్‌రన్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యాకు దక్కింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 133 పరుగులు చేసింది. కోల్‌కతా నిర్దేశించిన లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబాయి.. కేవలం ఒక వికెట్‌ను కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. క్రిస్ లిన్, రాబిన్ ఉతప్ప జట్టులో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు.