Breaking News
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర అగ్నిప్రమాదం. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో మంటలు. మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది.
  • అమరావతి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. వాడీవేడిగా జరగనున్న సమావేశాలు. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదలపై.. రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్న టీడీపీ. ఉల్లి ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన. అసెంబ్లీ గేట్‌ నుంచి ఉల్లిపాయల దండలతో.. అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

రెండు తలల పిల్లి..రెండు సార్లు

Kitten Born With 2 Faces Wants To Be Fed In Both Mouths At The Same Time Photos Videos, రెండు తలల పిల్లి..రెండు సార్లు

మొన్నామధ్య ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తెగ చక్కర్లు కొట్టింది. కొందరైతే, ఆ వీడియోను షేర్‌ చేయాలని, అలా చేస్తే మీకు శుభం కలుగుతుందనే ప్రచారం కూడా చేశారు. అలాగే, మనుషుల్లోనూ అప్పుడప్పుడు రెండు తలల శిశువు జన్మించినట్లుగా వార్తలు వింటుంటాం. కానీ, తాజాగా షోషల్ మీడియాలో రెండు తలలతో ఉన్న పిల్లి వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఈ పిల్లిని పెంచుకుంటున్న డాక్టర్ రాల్ఫ్ ట్రాన్.. ఈ పిల్లి జన్మించి నాలుగు నెలలు అయినట్టు చెప్పారు. రెండు తలలతో పుట్టడంతో.. పిల్లి తల్లి ఈ పిల్లిని దగ్గరకు రానీయక పోవడంతో తాను పెంచుకుంటున్నట్టు పేర్కొన్నారు. క్రానియోఫేషియల్ డూప్లికేషన్ అనే అరుదైన డిఫెక్ట్ కారణంగా డూయో ఇలా రెండు తలలతో జన్మించినట్టు డాక్టర్ రాల్ఫ్ తెలిపారు. ఈ డిఫెక్ట్‌తో పుట్టిన పిల్లి వారానికి మించి బతికింది లేదని.. డుయో మాత్రం నాలుగు నెలల తరువాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు రాల్ఫ్ ఆనందం వ్యక్తం చేశారు. రాల్ఫ్ ఈ పిల్లికి డుయో అని నామకరణం కూడా చేశారు. అయితే, సాధారణంగా ఇటువంటి డిఫెక్ట్‌తో పుట్టిన పిల్లి వారానికి మించి బతకవని చెబుతున్నారు. కానీ, డుయో మాత్రం నాలుగు నెలల తరువాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు రాల్ఫ్ ఆనందం వ్యక్తం చేశారు. డుయోకు రెండు తలలు, రెండు నోర్లు ఉండటంతో.. రెండు నోళ్ల నుంచి రెండు సార్లు మియావ్ అంటూ పిలుస్తోంది. ఈ పిలుపుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. డుయో రెండు తలలతో తింటూ..ఇంకో పిల్లితో ఆడుకుంటున్న వీడియోను మీరు చూడండి…