ముద్దు తెచ్చిన తంటా.. బ్రిడ్జ్ పైనే..

Kissing lovers tragically tumble over bridge to their deaths

పిచ్చి పీక్స్‌కు వెళ్లడమంటే ఇదేనేమో.. పెరూ దేశంలోని ఓ జంట బ్రిడ్జిపై ముద్దాదుకుంటూ.. అదుపు తప్పి కింద పడి చచ్చిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పెరూలో పర్వతారోహకులుగా పనిచేస్తున్న ఎస్పినోజ్, హెక్టర్ విడాల్ అనే జంట క్యూసో పట్టణంలో టూరిస్టు గైడ్లుగా పనిచేస్తున్నారు. అయితే ఒక రోజు పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో ఉన్న బెత్లెహాం వంతెనపై ఆగారు. ఒక్కసారిగా ప్రేమ ఉప్పొంగిపోయి.. ఇద్దరూ అక్కడే ముద్దాడడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే బ్రిడ్జి రైలింగ్‌పై కూర్చున్న మహిళ.. ఏమి జరిగిందో ఏమో తెలియదు గానీ ఒక్కసారిగా అదుపు తప్పి కిందపడిపోయింది. ఇక ఆమెతో పాటు ప్రియుడు కూడా అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి జారీ పడ్డాడు. ఇంకేముంది సుమారు 50 అడుగులపై నుంచి కింద పడటంతో ఆ మహిళ అక్కడికక్కడే చనిపోగా.. ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *