Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

డెత్ వారెంట్ ప్రకారమే ఉరి: నిర్భయ కేసులో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

kishanreddy on nirbhaya case, డెత్ వారెంట్ ప్రకారమే ఉరి: నిర్భయ కేసులో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నిర్భయ కేసులో దోషులపై జారీ అయిన డెత్ వారెంట్ ప్రకారమే ఉరి శిక్షను అమలు చేయాలన్నదే మోదీ ప్రభుత్వం ఉద్దేశమని క్లారిటీ ఇచ్చారు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి. నిర్భయ దోషులను శిక్షించడంపై కేంద్రం కృతనిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. న్యాయప్రక్రియలో లోపాలు సవరించే పని ప్రారంభించామని చెప్పారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో లోపాలపై అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలను లోపాలు లేకుండా చేసేందుకు సవరణలు తీసుకొస్తామని అన్నారు. పోక్సో చట్టంలో మోదీ సర్కార్ మార్పులు చేసిందని, అందువల్లనే 18 ఏళ్ళలోపు యువతులపై నేరాలు జరిగితే దోషులకు రెండు నెలల్లోపే శిక్ష పడుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. అందువల్లనే వరంగల్‌లో చిన్నారిని చిదిమేసిన రాక్షసునికి కేవలం 51 రోజుల్లోనే శిక్ష పడిందని అన్నారు.

నిర్భయ తరహా ఘటనల్లో దోషులకు క్షమాపణ తగదని రాష్ట్రపతి గతంలోనే అన్నారని, దానికి అనుగుణంగా మరోసారి తనముందుకు వచ్చిన క్షమాభిక్ష అభ్యర్థనను ప్రెసిడెంట్ కోవింద్ కొట్టేశారని చెప్పారు. హోంశాఖకు వచ్చిన మెర్సీ పిటిషన్‌ను మేం ఏమాత్రం జాప్యం చేయకుండా డిస్పోజ్ చేశామని, అంతే వేగంగా రాష్ట్రపతి కూడా నిర్ణయం తీసుకున్నారని అన్నారయన.

Related Tags