అనంతపురంజిల్లా నుంచి కిసాన్ రైలు ప్రయాణం

అనంతపురంజిల్లాలోని ఉద్యానవన రైతుల మార్కెటింగ్ కష్టాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన కిసాన్ రైలు ఈ రాత్రి హస్తినకు బయలుదేరేందుకు రెడీ అవుతోంది. మొదటి కిసాన్ రైలు విజయవంతం కావడంతో అదే ఉత్సాహాంతో..

అనంతపురంజిల్లా నుంచి కిసాన్ రైలు ప్రయాణం
Follow us

|

Updated on: Sep 19, 2020 | 7:50 PM

అనంతపురంజిల్లాలోని ఉద్యానవన రైతుల మార్కెటింగ్ కష్టాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన కిసాన్ రైలు ఈ రాత్రి హస్తినకు బయలుదేరేందుకు రెడీ అవుతోంది. మొదటి కిసాన్ రైలు విజయవంతం కావడంతో అదే ఉత్సాహాంతో రెండవ రైలుకు కూడా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం 3గంటల నుంచి ఉద్యాన ఉత్పత్తులను ట్రైన్ లోకి లోడ్ చేస్తున్నారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. మొత్తం 12 వ్యాగన్లలో 240 మెట్రిక్ టన్నుల మేర ఉద్యాన ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇందులో 10 వ్యాగన్లు ఢిల్లీలోని ఆజాధ్పుర్ మార్కెట్ కు, 2 వ్యాగన్లు నాగపూర్ కు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి 10 వ్యాగన్లలో నింపడానికి 230 టన్నులు ఉద్యాన ఉత్పత్తులు సిద్ధం చేసి అందుకు సంబంధించి రవాణా చార్జీలు కూడా రైల్వే శాఖకు చెల్లించారు. ఒక్కో వ్యాగన్లో 29 టన్నుల చొప్పున మొత్తంగా 12 వ్యాగన్లు పంపడానికి ఉద్యాన ఉత్పత్తులు సిద్ధం చేశారు. అలాగే అధికారులు, రైతులు, ట్రేడర్లు వెళ్లడానికి ఒక బోగీ కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం టమాటతో పాటు బొప్పాయి, అరటి, తర్బూజా ఉత్పత్తులు సిద్ధం చేశారు. అనుకున్న సమయానికి ఢిల్లీ మార్కెట్ కు రైలు చేరేలా చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.