ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన కిరణ్ బేడీ.. ఆడేసుకుంటున్న నెటిజన్స్

కరోనా వైరస్ గురించి ఫేక్ న్యూస్‌ని షేర్ చేయకండి.. చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ.. కేంద్రం ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తోన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వస్తోన్న ఎక్కువ. ఈ ఫేక్ న్యూస్‌తో పలువురు పొలిటికల్ లీడర్స్..

ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన కిరణ్ బేడీ.. ఆడేసుకుంటున్న నెటిజన్స్
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2020 | 10:26 PM

కరోనా వైరస్ గురించి ఫేక్ న్యూస్‌ని షేర్ చేయకండి.. చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ.. కేంద్రం ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తోన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వస్తోన్న ఎక్కువ. ఈ ఫేక్ న్యూస్‌తో పలువురు పొలిటికల్ లీడర్స్ కూడా బోల్తా పడుతున్నారు. నిజమేనని నమ్మి వీడియోల్ని పోస్ట్ చేస్తూ.. నెటిజన్లతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ గవర్నర్ కూడా ఫేక్ వీడియోల్ని గుడ్డిగా నమ్మి పోస్ట్ చేశారు.

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు మండిపడ్డారు. ఫేక్ వీడియోను షేర్ చేసిన కిరణ్ బేడీ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ‘కోడిగుడ్డు వల్ల కరోనా వస్తుందన్న మూఢ నమ్మకంతో మనం వాటిని పడేస్తున్నా.. అయితే అవన్నీ ఒక వారం తర్వాత పొదిగి ఇలా కోడి పిల్లలు అవుతాయి. ఇది సృష్టి స్వభావమని’ ఓ వీడియో ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.

దీంతో కిరణ్ బేడీ పోస్టుపై నెటిజన్లు విమర్శలు అందుకున్నారు. ప్రజలు తినే, పారేసే గుడ్లు ఎలా కోడిపిల్లలుగా మారతాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తినడానికి ఉపయోగించే కోడిగుడ్లు పిల్లలను ఎలా పొదుగుతాయని నెటిజన్లు ప్రశ్నించారు. ఫేక్ న్యూస్ పోస్ట్ చేసే ముందు ఆలోచించుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఆ తర్వాత కిరణ్ బేడీ ఆ ట్వీట్‌ని డిలీట్ చేశారు.

https://twitter.com/thekiranbedi/status/1246766862345490432?_ga=2.153243440.946557987.1586250278-541641717.1574040655

ఇవి కూడా చదవండి: 

గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్..

తెలంగాణ ప్రభుత్వానికి.. ‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్కే నాయుడు విరాళం

ఏప్రిల్ 11న ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. సీఎంలతో మరోసారి కాన్ఫరెన్స్

హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ‘కరోనా కారు’

తెలంగాణలో హాట్‌ స్పాట్‌లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం

అరుదైన ఘనత సాధించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి..

హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ పీకిన వైసీపీ ఎమ్మెల్యే