IPL 2020 KXIP vs SRH : ఆకట్టుకోలేకపోయిన పంజాబ్‌..హైదరాబాద్‌ టార్గెట్ 127

ఐపీఎల్ 2020 సీజన్‌లో మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అదరగొట్టారు. దుబాయ్ వేదికగా శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో రషీద్ ఖాన్ (2/14)…

  • Ram Naramaneni
  • Publish Date - 10:00 pm, Sat, 24 October 20

ఐపీఎల్ 2020 సీజన్‌లో మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అదరగొట్టారు. దుబాయ్ వేదికగా శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో రషీద్ ఖాన్ (2/14), జేస్ హోల్డర్ (2/27), సందీప్ శర్మ (2/29) చెలరేగిపోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 126 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో నికోలస్ పూరన్ (32 నాటౌట్: 20 బంతుల్లో 2×4, 1×6) అత్యధిక పరుగులు చేశాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో.. గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ (27: 27 బంతుల్లో 2×4, 1×6), మన్‌దీప్ సింగ్ (17: 14 బంతుల్లో 1×4) తొలి వికెట్‌కి 37 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పారు. అనంతరం వచ్చిన క్రిస్‌గేల్ (20: 20 బంతుల్లో 2×4, 1×6) ఎదురుదాడి చేసే క్రమంలో పెవిలియన్ చేరాడు.  ఇక గ్లెన్ మాక్స్‌వెల్ (12) మరోసారి విఫలమయ్యాడు. దాంతో.. నికోలస్ పూరన్ ఆఖరి వరకూ క్రీజులో ఉన్నా భారీ షాట్లతో విరుచుకుపడలేకపోయాడు. దీపక్ హుడా (0) కూడా స్టంపౌట్ ఔటవడం పంజాబ్‌ని డెత్ ఓవర్లలో దెబ్బతీసింది. క్రిస్ జోర్దాన్ (7), మురగన్ అశ్విన్ (4) పూరన్‌కు చేదోడుగా నిలవలేకపోయారు. దాంతో.. పంజాబ్ టీమ్ 126 పరుగులకే పరిమితమైంది.