కిమ్ కంటే ఈమె యమా డేంజర్.. అమెరికాకు స్వీట్ వార్నింగ్..

కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచంలో ఈపేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఆధునిక నియంతగా.. అణ్వాయుధాల సృష్టికర్తగా ఈ నార్త్ కొరియా అధ్యక్షుడికి గొప్ప గుర్తింపు ఉంది. కిమ్ అంటేనే మనకు యుద్ద వాతావరణం గుర్తొస్తుంది. అయితే తాజాగా ఆ దేశ పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. అతడి కంటే అతడి సోదరి కిమ్ యో జోంగ్ లేడి హిట్లర్‌గా అవతరిస్తున్న కనిపిస్తోంది. త్వరలోనే అధ్యక్ష పదవిని కూడా ఆమె చేపట్టబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా అక్కడ చోటు […]

కిమ్ కంటే ఈమె యమా డేంజర్.. అమెరికాకు స్వీట్ వార్నింగ్..
Follow us

|

Updated on: Jul 11, 2020 | 1:29 PM

కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచంలో ఈపేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఆధునిక నియంతగా.. అణ్వాయుధాల సృష్టికర్తగా ఈ నార్త్ కొరియా అధ్యక్షుడికి గొప్ప గుర్తింపు ఉంది. కిమ్ అంటేనే మనకు యుద్ద వాతావరణం గుర్తొస్తుంది. అయితే తాజాగా ఆ దేశ పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. అతడి కంటే అతడి సోదరి కిమ్ యో జోంగ్ లేడి హిట్లర్‌గా అవతరిస్తున్న కనిపిస్తోంది. త్వరలోనే అధ్యక్ష పదవిని కూడా ఆమె చేపట్టబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఈ ఏడాది మధ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య ఓ హైప్రోఫైల్ మీటింగ్ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. అయితే ఈ సమావేశం కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ అంగీకరిస్తేనే ట్రంప్ భేటి అవుతారని.. నాలుగు నెలల క్రిందట వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇక దీనిపై తాజాగా పలు వార్తలు వస్తుండటంతో నార్త్ కొరియా స్పందించింది.

ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ భేటి అవుతారంటూ వస్తున్న వార్తలను కిమ్ యో జోంగ్ కొట్టిపారేసింది. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య న్యూక్లియర్ డిప్లోమెసి నేపధ్యంలో ఇప్పట్లో ఎలాంటి సమావేశాలు జరిగే అవకాశం లేదని ఆమె స్పష్టం చేసింది. అణ్వస్త్ర దేశంలో నార్త్ కొరియా అవిర్భవించగా.. 2018లో ట్రంప్, కిమ్ మధ్య ఓ అత్యున్నత స్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాది మరోసారి ఈ ఇద్దరు అధ్యక్షులు సమావేశం కావాల్సి ఉంది. అయితే తాజాగా అలాంటి షెడ్యూల్ సమావేశాలు ఏవీ కూడా ఇప్పట్లో లేవని కిమ్ యో జోంగ్ ప్రకటించడం ఇప్పుడు ప్రపంచదేశాలను ఆకర్షించింది. త్వరలో దేశ బాధ్యతలు తీసుకోబోతున్న నేపధ్యంలో ఆమె గత కొంతకాలంగా పరిపాలనలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కిమ్ కొద్దిరోజుల ముందు ఓ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆయన పరిపాలనా వ్యవహారాల్లో తక్కువగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా సోదరి కిమ్ యో జోంగ్‌కు కీలక పదవి కట్టబెట్టినట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం విదేశాంగ వ్యవహారాలు చూసుకుంటున్నారట. అధ్యక్షుడిగా కిమ్ కొనసాగుతున్నప్పటికీ.. పరోక్షంగా దేశ బాధ్యతలను కిమ్ యో జోంగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచం మొదటి లేడి హిట్లర్‌ను చూసే సమయం దగ్గర పడిందని చెప్పాలి.

Also Read:

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటికే ఉచితంగా కిట్లు పంపిణీ..

గుడ్ న్యూస్.. కరోనాకు చెక్ పెట్టేందుకు మరో మెడిసిన్ రెడీ..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్..!

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!