కిమ్ ఇలాకాలో కరోనా భయం.. తేడా వస్తే ఇక అంతే..!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని.. ఒక్క కేసు నమోదైనా కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిమ్ జోంగ్ ఉన్...

కిమ్ ఇలాకాలో కరోనా భయం.. తేడా వస్తే ఇక అంతే..!
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 5:33 PM

ఇప్పటివరకు తన దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని గొప్పలు చెప్పుకున్న నార్త్ కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పుడు ఆ కనిపించని శత్రువుకు తెగ భయపడుతున్నాడు. కఠిన శిక్షలు అమలు చేయడంతో దిట్ట అయిన కిమ్.. కరోనా విషయంలో అధికారులు జాగ్రత్తలు పాటించకపోతే చర్యలు వేరే లెవెల్ లో ఉంటాయని హెచ్చరిస్తున్నాడట.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని.. ఒక్క కేసు నమోదైనా కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిమ్ జోంగ్ ఉన్ పార్టీ ఉన్నతాధికారులకు హెచ్చరికలు జారీ చేశాడని అక్కడి మీడియా వెల్లడించింది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విషయంలో చాలా బలహీనంగా ఉన్న నార్త్ కొరియా.. దేశంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సరిహద్దులు ఎప్పుడో మూసి వేసింది. అంతేకాకుండా దేశమంతా లాక్ డౌన్ కూడా విధించింది. అక్కడి అధికార యంత్రాంగం చాలామంది ప్రజలను హోం క్వారంటైన్‌లో కూడా ఉంచారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో స్కూళ్లను జూన్ మొదటివారంలో పునః ప్రారంభించేందుకు నార్త్ కొరియా ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉన్నతాధికారులకు కిమ్ కరోనా విషయంలో హెచ్చరించారట. వాస్తవానికి ఏప్రిల్ నెలలో మొదలు కావాల్సిన స్కూళ్లు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడ్డాయి. జూన్ మొదటి వారం నుంచి కార్యకలాపాల్ని తిరిగి ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తున్న కిమ్.. అన్ని స్కూళ్లు, విద్యాసంస్థలు, ఆఫీసులు వద్ద హ్యాండ్ శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు తప్పనిసరిగా కరోనా మార్గదర్శకాలను పాటించాలని హెచ్చరించారు. అంతేకాకుండా హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు టేక్ వే ఆర్డర్లకు ప్రాముఖ్యత ఇవ్వాలని తెలిపారు. ఏది ఏమైనా ప్రపంచదేశాలను భయపెడుతున్న కరోనా మహమ్మారి చివరికి డిక్టేటర్ కిమ్ ను కూడా వణికించిందని చెప్పాలి.