విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం

విశాఖపట్టణంలో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌కు చెందిన పార్థసారధి నుంచి కిడ్నీ సేకరించి మోసం చేసింది ఓ ముఠా. రూ.12లక్షలకు ఒప్పందం చేసుకొని, బాధితుడికి రూ.5లక్షలను ఇచ్చింది ఆ ముఠా. దీంతో ఆ బాధితుడు మహరాణిపేట పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు పత్రాలు ఫోర్జరీ చేసి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారంటూ పార్థసారధి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై డీజీపీ ఠాకూర్ మాట్లాడుతూ.. కిడ్నీ రాకెట్ కేసును సీపీ దర్యాప్తు […]

విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం
Follow us

| Edited By:

Updated on: May 09, 2019 | 3:37 PM

విశాఖపట్టణంలో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌కు చెందిన పార్థసారధి నుంచి కిడ్నీ సేకరించి మోసం చేసింది ఓ ముఠా. రూ.12లక్షలకు ఒప్పందం చేసుకొని, బాధితుడికి రూ.5లక్షలను ఇచ్చింది ఆ ముఠా. దీంతో ఆ బాధితుడు మహరాణిపేట పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు పత్రాలు ఫోర్జరీ చేసి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారంటూ పార్థసారధి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై డీజీపీ ఠాకూర్ మాట్లాడుతూ.. కిడ్నీ రాకెట్ కేసును సీపీ దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. నిందితుల్లో ఒక డాక్టర్ కూడా ఉన్నారని.. విచారణ చేసి మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. కాగా ఈ కేసులో ఇప్పటికే నలుగురిని నిందితులుగా చేర్చిన పోలీసులు.. కీలక వ్యక్తి మంజునాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు.