ఈ బుడ్డోడు భలే లక్కీ.. అదృష్టం అంటే ఇలా ఉండాలి..

భూమి మీద నూకలు బాకీ ఉంటే చాలు.. ఎంతటి ప్రమాదం వచ్చిన సేఫ్‌గా బయటపడతారంటారు పెద్దలు. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే ఆ పెద్దల మాట నిజమే అనిపిస్తుంది. ఓ తండ్రి నిర్లక్ష్యంగా కారు డ్రైవ్‌చేస్తూ.. సొంత కొడుకు.. చావు రుచేంటో చూపించాడు. కానీ ఆ బుడ్డోడోకి ఇంకా భూమి మీద నూకలు బాకీ ఉన్నట్లుంది. అందుకే అదృష్టం కలిసొచ్చి.. బతికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి కారులో తన కుమారుడిని వెనక సీట్లో కూర్చొబెట్టుకుని డ్రైవ్ […]

ఈ బుడ్డోడు భలే లక్కీ.. అదృష్టం అంటే ఇలా ఉండాలి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 10, 2020 | 9:43 AM

భూమి మీద నూకలు బాకీ ఉంటే చాలు.. ఎంతటి ప్రమాదం వచ్చిన సేఫ్‌గా బయటపడతారంటారు పెద్దలు. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే ఆ పెద్దల మాట నిజమే అనిపిస్తుంది. ఓ తండ్రి నిర్లక్ష్యంగా కారు డ్రైవ్‌చేస్తూ.. సొంత కొడుకు.. చావు రుచేంటో చూపించాడు. కానీ ఆ బుడ్డోడోకి ఇంకా భూమి మీద నూకలు బాకీ ఉన్నట్లుంది. అందుకే అదృష్టం కలిసొచ్చి.. బతికిపోయాడు.

వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి కారులో తన కుమారుడిని వెనక సీట్లో కూర్చొబెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడు. అయితే కారు ప్రాంరభించే ముందు అన్ని డోర్లు లాక్ అయ్యాయా.. లేదా అన్న విషయాన్ని గమనించలేదు. అలాగే వెళ్లసాగాడు. అయితే వెనకా సీట్లో కొడుకు ఒక్కడే ఉండటం.. అదే సమయంలో ఆ వెనకాల ఉన్న డోర్ లాక్ కాకపోవడంతో ప్రమాదం సంభవించింది. ఓ ప్రమాదపు మలుపు దగ్గర సడన్‌గా ఆ కారు డోర్ తెరుచుకుంది. అంతే.. అందులో ఉన్న ఆ వ్యక్తి కుమారుడు మలుపువద్ద కిందపడిపోయాడు. అయితే అదే సమయంలో వెనకవైపు నుంచి ఓ భారీ వాహనం.. అటు ముందు నుంచి కూడా మరో భారీ వాహనం వస్తోంది. అయితే కారు నుంచి ఆ బాలుడు పడిపోవడాన్ని గమనించిన ఆ భారీ వాహనల డ్రైవర్లు అప్రమత్తమయ్యారు. ఉన్నఫలంగా బ్రేకులు వేసి.. వాహనాలను ఆపేశారు. దీంతో ఆ బాలుడి ప్రాణాలు దక్కాయి. ఆ తర్వాత వెంటనే ఆ కారులోంచి వచ్చిన ఆ బాలుడి తండ్రి వచ్చి.. తన కుమారుడిని తీసుకెళ్లాడు. అయితే ఇక్కడ ఆ బాలుడి తండ్రి నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి కేరళ రాష్ట్రంలో వైరల్‌గా మారింది. దీనిని గమనించిన పంకజ్ జైన్ అనే ఓ ఐపీఎస్ అధికారి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.

ప్రయాణాలు చేస్తున్నప్పుడు నిర్లక్ష్యం పనికి రాదని.. ముఖ్యంగా కార్లో ప్రయాణిస్తున్నప్పుడు.. కారు డోర్లు లాక్ అయ్యాయా లేదా అన్నది గమనించాలని.. అలాగే ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దంటూ.. అందరూ ఈ బాలుడిలా అదృష్టవంతులు ఉండరంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?