Breaking News
 • చైనీస్ గేమింగ్ కేసుల్లో కొత్త కోణాలు . గేమింగ్ లో బెట్టింగ్ పెట్టి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు . ఎస్ఆర్ నగర్ లో 6 లక్షలు , అదిలాబాద్ లో 15 లక్షలు పోగొట్టుకున్న యువకుడు సూసైడ్ . తాము కూడా లక్షలు పోగొట్టుకున్నామని సైబర్ క్రైమ్ కు క్యూ కడుతున్న బాధితులు . టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్స్ ఫై సైబర్ క్రైమ్ పొలిసుల విచారణ . టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్ ల ద్వారా వస్తున్న రిఫెరల్ కోడ్ , ప్రెడిక్షన్ ల ఫై కేసు నమోదు చేయనున్న సైబర్ క్రైమ్ పోలీసులు . చైనా దేశస్థుడు యాహువో, దిల్లీకి చెందిన ధీరజ్‌ సర్కార్‌, అంకిత్‌ కపూర్‌, నీరజ్‌ లను కస్టడీ తీసుకోనున్న పోలీసులు . బెట్టింగ్ యాప్ లో ద్వారా 110 కోట్లు వసూళ్లు . పెమా , మని ల్యాండరింగ్ జరిగినట్టు ప్రాధమిక అంచనా . కంపెనీ డైరెక్టర్ ల లావాదేవీ ల ఫై ఈడీ కి లేక రాయనున్న సీసీఎస్ పోలీసులు.
 • చెన్నై : ప్రముఖ నటి నిక్కీగల్రనికి కరోనా సోకినట్టు నిర్ధారణ . తెలుగు తమిళ్ మలయాళం లో పలు చిత్రాలలో నటించిన నటి నిక్కీగల్రని. తనకు వైద్యపరీక్షల అనంతరం కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారని , ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని తన ట్విట్టర్ లో వెల్లడి
 • తెలంగాణ పోలీస్ శాఖ లో కరోనా కలకలం . తెలగాణలో 4259 మంది పోలీసులకు కరోనా . ఎక్కువగా హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ లో 1946 మంది పోలీస్ ల కి కరోనా . తెలంగాణ వ్యాప్తం గా కరోనా తో 39 మంది పోలీసులు మృతి . హైద్రాబాద్ కమీషనరేట్ లిమిట్స్ లో 26 మంది మృతి . పోలీస్ కరోనా కేసుల్లో హైద్రాబాద్ తర్వాత వరంగల్ , రాజన్న సిరిసిల్ల , నల్గొండ లో పోలిసులకు ఎక్కువ కరోనా కేసులు.
 • అమీన్పూర్ అనాధ ఆశ్రమంలో.. మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో కొత్త కోణం. ఆలస్యంగా వెలుగులోకి మారుతీ అనాధ ఆశ్రమ ఆగడాలు. మరోమైనర్ బాలికపై సైతం నిందితుడు వేనుగోపాల్ లైంగికదాడి. కుటుంబ సభ్యులు నిలదీయడంతో నిర్వాకుల బెదిరింపులు. ఆలస్యంగా వెలుగులోకి మారుతీ అనాధ ఆశ్రమ ఆగడాలు. సంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితులకు సన్నిహిత సంభందాలు. జిల్లా చెల్డ్ వెలిఫేర్ కమిటీ సభ్యురాలి సహకారంతో అక్రమాలు. లాక్డౌన్ సమయంలో రెస్కూచేసిన మైనర్లను ఇక్కడికే పంపాలనీ సిబ్బందిపై ఒత్తిడి. కమిటీ సమావేశాలకు సైతం నేరూగా హాజరైన నిందితుడు వేణుగోపాల్. హైపవర్ కమిటీ విచారణలో వెలుగులోకి వస్తున్న మారుతీ అనాధ ఆశ్రమం ఆగడాలు. అనాధ ఆశ్రమంలోని 70మందిని విచారించనున్న అధికారులు. రాష్ట్రం లోని ఇతర అనాధ ఆశ్రమలాల్లో సైతం తనిఖీలకు అధికారుల ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా 400ఆశ్రమాలు,19వేల మంది అనాధలు.
 • టాలీవుడ్ లో మరో పొలిటికల్ డ్రామా ఫిల్మ్ రూపొందుతోంది. నారా చంద్రబాబు నాయుడు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల స్నేహాన్ని, రాజకీయ శతృత్వాన్ని తెరకెక్కిస్తున్నారు. "ఇంద్రప్రస్థం" పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కు దర్శకుడు దేవా కట్టా. రీసెంట్ గా కథా చౌర్యం వివాదంలో పడిన ఈ కథ ఇప్పుడు టాక్ ఆప్ ద టాలీవుడ్.
 • మర్డర్ సినిమా విడుదల నిలిపివేయాలని అమృత వేసిన పిటిషన్ పై ఇవాళ నల్గొండ SC, ST కోర్టులో విచారణ.
 • స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం పై విచారణ వేగవంతం చేసిన పోలీసులు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను కస్టడీ కి కోరుతు కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు. ముగ్గురు నుండి మరికొన్ని విషయాలు సేకరించేందుకు వారం రోజుల పాటు కస్టడీ కి ఇవ్వాలని విజయవాడ 3rd ఏసిఎమ్ఎమ్ కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్న నిందితుల తరుపున న్యాయవాది.

‘పహిల్వాన్’ – టైటిల్ అదిరినా.. పట్టులేని కుస్తీ!

Sudeep Pahilwan Telugu Movie Review, ‘పహిల్వాన్’ – టైటిల్ అదిరినా.. పట్టులేని కుస్తీ!

టైటిల్ : ‘ప‌హిల్వాన్‌’

తారాగణం : సుదీప్‌, ఆకాంక్ష సింగ్‌, సునీల్‌ శెట్టి, సుశాంత్‌ సింగ్‌, కబీర్‌ దుహన్‌ సింగ్‌, అవినాష్‌ తదితరులు

సంగీతం : అర్జున్‌ జన్యా

నిర్మాతలు : స్వప్నకృష్ణ

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఎస్‌.కృష్ణ

విడుదల తేదీ: 12-09-2019

 

కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించిన తాజా చిత్రం ‘పహిల్వాన్’. రాజమౌళి ‘ఈగ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సుదీప్‌కు ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా తెలుగులో హిట్టయిన ‘విక్రమార్కుడు’, ‘అత్తారింటికి దారేది’ ‘మిర్చి’ సినిమాలను కన్నడంలో రీమేక్ చేసి మాస్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఇప్పుడు తాజాగా ‘పహిల్వాన్’తో అటు కన్నడ.. ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. మరి ఈ సినిమా ఫ్యాన్స్‌ను ఏమేరకు మెప్పించగలిగిందో ఈ సమీక్షలో చూద్దాం.?

కథ‌ :

కృష్ణ(సుదీప్) ఓ అనాథ. అతన్ని శంకర్(సునీల్ శెట్టి)  అనే ఓ కుస్తీ యోధుడు చేరదీస్తాడు. చిన్నప్పటి నుంచి శంకర్‌ను గురువుగా భావించే కృష్ణ.. అతని దగ్గరే కుస్తీలో మెళకువలు నేర్చుకుని.. పెద్ద వస్తాదులా మారతాడు. అనుకోని విధంగా ఓ అమ్మాయి(ఆకాంక్ష సింగ్) కృష్ణ జీవితంలోకి రావడంతో కుస్తీని క్రమంగా నిర్లక్ష్యం చేస్తుంటాడు. కృష్ణ ప్రవర్తనను చూసిన గురువు శంకర్ కోపంతో ‘నా నుంచి నేర్చుకున్న ఈ కుస్తీని నువ్వు ఎప్పుడూ ఎక్కడా ప్రదర్శించకూడదని వాగ్దానం తీసుకుంటాడు’. ఇక గురువు ఆజ్ఞ మేరకు కృష్ణ అన్నింటిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు. అలాంటి కృష్ణ బాక్సింగ్ ఛాంపియన్ ఎలా అయ్యాడు..? ఈ క్రమంలో గురువు శంకర్, కృష్ణకు సహాయం అందించాడా.?  అనే ప్రశ్నలకు సమాధానం వెండి తెరపై చూడాల్సిందే.

న‌టీన‌టుల అభినయం:

‘పహిల్వాన్’కు ముఖ్యంగా హీరో సుదీపే బలం. కృష్ణ అనే కుస్తీ యోధుడి పాత్రలో సుదీప్ తన మార్క్ నటనతో ప్రేక్షకులకు రక్తికట్టించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో ఈజ్‌తో నటించాడు. శంకర్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి జీవించాడని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఆకాంక్ష సింగ్ అటు గ్లామర్‌ పరంగా, ఇటు నటనలోనూ మంచి మార్కులే సంపాదించింది. క‌బీర్ విల‌నిజం రొటీన్‌గా సాగిపోయింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేష‌ణ‌ :

కన్నడిగులకు ఈ సినిమా నచ్చుతుందేమో గానీ.. తెలుగు ప్రేక్షకులు మాత్రం అంతగా కనెక్ట్ కాలేరు. రొటీన్ కథ, కథనం.. అంతేకాకుండా కొన్ని వర్గాల వారికే నచ్చే అంశాలు ‘పహిల్వాన్’లో కనిపిస్తాయి. తండ్రీ-కూతుళ్ల ఎపిసోడ్ ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేదే. కాక‌పోతే దాని నిడివి మ‌రీ ఎక్కువై విసిగించింది. ప‌తాక స‌న్నివేశాలన్నీ బాక్సింగ్ నేప‌థ్యంలో సాగేవే. హీరో ఈ పోరులో గెలుస్తాడ‌ని ఎలాగూ ప్రేక్ష‌కులు ఊహిస్తారు. ఓవరాల్‌గా భారీ హంగుల‌తో వ‌చ్చిన ప‌హిల్వాన్ ఓ రొటీన్ స్పోర్ట్స్ డ్రామాగా నిలిచిపోవాల్సి వ‌చ్చింది.

సాంకేతిక విభాగాల పనితీరు:

నేపధ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలం. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా కలిసొచ్చింది. కెమెరా పనితనం బాగుంది. సాంకేతికంగా సినిమాను ఉన్నత స్థాయిలోనే తీర్చిదిద్దారు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

 • సుదీప్
 • యాక్షన్ సన్నివేశాలు
 • సాంకేతిక విలువలు

మైనస్‌ పాయింట్స్‌ :

 • రొటీన్ కథా, కథనం

Related Tags