Breaking News
  • భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కరోనాపై పోరులో భారత్‌ చేయాల్సిందంతా చేస్తోంది. సాయం చేయడానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటాం-ప్రధాని మోదీ.
  • ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు. కరోనాపై యుద్ధంలో భారతీయుల కృషి అభినందనీయం. భారత ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు-ట్రంప్‌ ట్వీట్‌.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో గుండెపోటుతో వ్యక్తి మృతి. ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తికి సోదరుడు కావడంతో.. స్థానికుల్లో పలు అనుమానాలు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలింపు. శాంపిల్స్‌ పరీక్షించే వరకు మృతదేహం ఇవ్వమంటున్న అధికారులు.
  • తెలంగాణలో డయల్‌ 100కు పెరుగుతున్న కాల్స్‌. లాక్‌డౌన్‌ తర్వాత డయల్‌ 100కు 13,34,330 కాల్స్‌. ఎమర్జెన్సీ కాల్స్‌-82,014. కోవిడ్‌ సస్పెక్ట్ కాల్స్‌- 2,710. లాక్‌డౌన్‌ కాల్స్‌-21,758. ఇన్‌ ఎఫెక్టివ్‌ కాల్స్‌-87,665. విచారణ కోసం చేసిన కాల్స్‌- 84,123. తగ్గిన చోరీలు, గృహ హింస, రోడ్డుప్రమాదాల కాల్స్‌.
  • తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రైమ్‌రేట్‌ భారీగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రైమ్‌రేటు 56 శాతానికి పడిపోవడం ఊరటనిస్తోంది. లాక్‌డౌన్‌తో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

పవన్‌కు ‘నో’.. మహేష్‌కు మరోసారి ‘ఓకే’..!

Heroine rejects Pawan, పవన్‌కు ‘నో’.. మహేష్‌కు మరోసారి ‘ఓకే’..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా మూడు చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ ‌రెండు సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. అందులో పింక్ రీమేక్‌ ఒకటి కాగా.. క్రిష్ దర్శకత్వంలో మరొకటి. చారిత్రాత్మక చిత్రంగా క్రిష్ మూవీ తెరకెక్కుతుండగా.. పండుగ సాయన్న పాత్రలో పవన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా కియారా అద్వానీని సంప్రదించిందట చిత్ర యూనిట్. అయితే ఈ ఆఫర్‌కు ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది.

Heroine rejects Pawan, పవన్‌కు ‘నో’.. మహేష్‌కు మరోసారి ‘ఓకే’..!

భరత్ అనే నేను చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కియారా.. ఆ తరువాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామలో నటించింది. ఆ తరువాత బాలీవుడ్‌లో వరుస అవకాశాలు రావడంతో.. అక్కడ బిజీబిజీగా గడిపేస్తోంది కియారా. ఈ క్రమంలో ఈ మధ్యన పవన్ సినిమా కోసం ఆమెను కలవగా.. వద్దని చెప్పినట్లు టాక్. అంతేకాదు విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ సినిమాలకు కూడా కియారా నో చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఆసక్తికరంగా మహేష్ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మహేష్-వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతోన్న రెండో చిత్రంలో కియారా హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు టాక్. మరి మిగిలిన వారందరికీ నో చెబుతూ.. కేవలం మహేష్‌కు మాత్రమే కియారా ఓకే చెప్పడానికి గల కారణాలేంటో..? అన్న టాక్ ఫిలింనగర్‌లో నడుస్తోంది. కాగా దక్షిణాదిని మాత్రం వదిలేది లేదని.. సంవత్సరానికి ఒక్క సినిమా అయినా ఇక్కడ చేస్తానంటూ ఇటీవల కియారా ఓ సందర్భంలో వెల్లడించిన విషయం తెలిసిందే.

Related Tags