పరిగెత్తనున్న తొలి కియా కారు..సీఎం జగన్‌కు ఆహ్వానం!

KIA to launch its first 'Made in India' car on Aug 8th invites CM Jagan, పరిగెత్తనున్న తొలి కియా కారు..సీఎం జగన్‌కు ఆహ్వానం!

అమరావతి: ఆగష్టు 8న కియా కొత్త కారు ‘‘సెల్తోస్‌’’ను మార్కెట్లోకి విడుదలవుతోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. సీఎం నివాసంలో కంపెనీ ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ థామస్‌ కిమ్‌ సీఎంను కలిసి కొత్తకారు ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. అనంతపురం జిల్లా పెనుకొండ ప్లాంటు ద్వారా ఏటా 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయగలమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

భవిష్యత్తులో 7 లక్షల కార్లను తయారు చేసే సామర్థ్యానికి చేరుకుంటామని సీఎంకు వెల్లడించారు. ప్రస్తుతం టర్కీ, స్లొవేకియాలకు ఇంజిన్లను కూడా ఎగుమతి చేస్తామన్నారు. కియా కొత్తకారు ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు సీఎం జగన్‌ అంగీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *