ఖుష్బూ వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు, దినేష్ గుండూరావు

తమిళనటి ఖుష్బూ సుందర్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పటికీ తమిళనాడులో పార్టీపై దీని ప్రభావం ఉండబోదని తమిళ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ దినేష్ గుండూరావు అన్నారు. ఆమెకు అసలు సిధ్ధాంత పరమైన కమిట్ మెంట్ లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయిన క్షుష్బూ..పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలో కొందరు నియంతల్లా వ్యవహరిస్తున్నారని, తనను అణగదొక్కుతున్నారని ఆమె ఆరోపించారు.కాగా – తమిళనాడు అసెంబ్లీ ఎఎన్నికలు వచ్ఛే […]

ఖుష్బూ వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు, దినేష్ గుండూరావు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 12, 2020 | 4:41 PM

తమిళనటి ఖుష్బూ సుందర్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పటికీ తమిళనాడులో పార్టీపై దీని ప్రభావం ఉండబోదని తమిళ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ దినేష్ గుండూరావు అన్నారు. ఆమెకు అసలు సిధ్ధాంత పరమైన కమిట్ మెంట్ లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయిన క్షుష్బూ..పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలో కొందరు నియంతల్లా వ్యవహరిస్తున్నారని, తనను అణగదొక్కుతున్నారని ఆమె ఆరోపించారు.కాగా – తమిళనాడు అసెంబ్లీ ఎఎన్నికలు వచ్ఛే ఏడాది జరగనున్న తరుణంలో క్షుష్బూ ఇలా కాంగ్రెస్ ను వీడడం దురదృష్టకరమని దినేష్ అంటూనే.. బీజేపీలో ఆమె చేరినంత మాత్రాన తమిళప్రజల్లో  ఈ కాషాయ పార్టీ పట్ల  వ్యతిరేక భావనలు చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని విస్మరించరాదన్నారు.  బహుశా ఖుష్బూ పాలిటిక్స్ కోసం కాక..ఇతర కారణాలవల్ల బీజేపీలో చేరి ఉండవచ్చు అని దినేష్ అభిప్రాయపడ్డారు.