కేహెచ్ఆర్6666… కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతోందో తెలుసా ?

కేసీఆర్‌ తెలుసు.. కేటీఆర్‌ కూడా తెలుసు.. మరీ ఈ కేహెచ్‌ఆర్‌ ఎవరు? ఇదిప్పుడు తెలంగాణలో దుమ్మురేపుతోన్న పేరు. ఎవరీ కేహెచ్‌ఆర్ ? ఇదిప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌ అయింది. కేహెచ్‌ఆర్‌ పేరుతో….సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే వారికి ఎంతో కొంత పరిచయం ఉన్న పేరే కేహెచ్‌ఆర్‌ 6666. కాస్త ఆలోచిస్తే.. కేహెచ్‌ఆర్‌ పదాన్ని కాస్త పరిశీలిస్తే ఎవరో తెలిసిపోతుంది. ఎస్.. మీరు ఊహించినది నిజమే. తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మనవడే […]

కేహెచ్ఆర్6666... కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతోందో తెలుసా ?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 21, 2019 | 4:54 PM

కేసీఆర్‌ తెలుసు.. కేటీఆర్‌ కూడా తెలుసు.. మరీ ఈ కేహెచ్‌ఆర్‌ ఎవరు? ఇదిప్పుడు తెలంగాణలో దుమ్మురేపుతోన్న పేరు. ఎవరీ కేహెచ్‌ఆర్ ? ఇదిప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌ అయింది. కేహెచ్‌ఆర్‌ పేరుతో….సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే వారికి ఎంతో కొంత పరిచయం ఉన్న పేరే కేహెచ్‌ఆర్‌ 6666. కాస్త ఆలోచిస్తే.. కేహెచ్‌ఆర్‌ పదాన్ని కాస్త పరిశీలిస్తే ఎవరో తెలిసిపోతుంది.

ఎస్.. మీరు ఊహించినది నిజమే. తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మనవడే కేహెచ్‌ఆర్. తాత కేసీఆర్‌ లాగానే కేహెచ్‌ఆర్‌కి కూడా లక్కీ నెంబర్‌ 6. అందుకే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కి కేహెచ్‌ఆర్‌ 6666 అని పెట్టుకున్నారు.

కేహెచ్‌ఆర్‌ అంటే కల్వకుంట్ల హిమాన్షు రావు. కల్వకుంట్ల తారక రామారావు (కెటీఆర్) తనయుడు. ఇప్పుడు కేహెచ్‌ఆర్‌ చేసిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు హిమాన్షు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఇంటర్వ్యూ చేశారు. స్కూల్ ప్రాజెక్ట్ విషయమై మంత్రిని ఇంటర్వ్యూ చేసినట్లు సోషల్‌ మీడియాలో తన ఖాతాలో హిమాన్షు పేర్కొన్నారు.

తెలంగాణలో శిశు సంక్షేమం గురించి మంత్రితో చర్చించినట్టు కేహెచ్ఆర్ చెప్పారు. దీనికి సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఇంటర్వ్యూ ఫోటోను పెట్టారాయన. మంత్రి సత్యవతితో కలిసి సైదాబాద్‌లోని బాల నేరస్థుల జువైనల్‌ హోంను సందర్శించారట. అక్కడి స్థితిగతులను ఆరా తీశారట. ఆ తర్వాత ఇదే విషయంపై మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఇంటర్వ్యూ చేశారట. తాను చదివే స్కూల్లో బాలల సంక్షేమంపై ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారట. ఇందులో భాగంగానే తాను మంత్రిని ఇంటర్వ్యూ చేసినట్లు హిమాన్షు చెప్పారు. మొత్తానికి కల్వకుంట్ల కుటుంబంలో మూడో తరం యాక్టివ్‌ అవుతోంది. తండ్రి కేటీఆర్‌ లాగానే హిమాన్షు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారట.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.