టోల్ ఫీజు కట్టమంటే.. మహిళా ఉద్యోగినిపై దాడి..!

రోజురోజుకీ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలు, దాడులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా.. గురుగ్రామ్‌ జిల్లా ఖేడ్కీ దౌలా టోల్ ప్లాజ్‌ వద్ద ఓ సంఘటన చోటుచేసుకుంది. టోల్‌ప్లాజా వద్ద ఓ వాహనదారుడిని డబ్బులు అడిగిన మహిళా ఉద్యోగినితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. టోల్ ప్లాజా కట్టమన్నందుకు.. అసభ్యకరంగా మాట్లాడినందుకు.. మహిళా ఉద్యోగిని ఎదిరించగా.. ఆ వ్యక్తి చెంప ఛెళ్లుమనేలా కొట్టి వెళ్లిపోయాడు. కాగా..ఈ ఘటనలో బాధితురాలు స్వల్పంగా గాయపడింది. ఈ విషయాన్ని సదరు ఉద్యోగులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఇదికాస్తా వైరల్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *