డైరెక్ట్ ఓటిటిలో ‘కేజీఎఫ్ 2’ రిలీజ్..మూవీ యూనిట్ క్లారిటీ…

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ నేప‌థ్యంలో గ‌త రెండు నెల‌లుగా సినిమా, సీరియ‌ల్ షూటింగ్స్ ఆగిపోయాయి. థియేట‌ర్స్ పూర్తిగా మూతప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో జ‌నాలు అధిక సంఖ్యలో డిజిట‌ల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలలో మూవీస్ చూడ‌టానికి అల‌వాటుప‌డ్డారు. కాగా సినిమాలు విడుద‌ల కాక‌పోవ‌డంతో.. ఫైనాన్స‌ర్ల ద‌గ్గ‌ర తెచ్చిన డ‌బ్బుల‌కు వ‌డ్డీ పెరి‌గిపోవ‌డంతో ప్రొడ్యూస‌ర్ల‌కు కూడా భారీగా న‌ష్టాలు వచ్చే ప‌రిస్థితులు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో కంప్లీట్ అయిన‌ చాలా సినిమాలను డైరెక్ట్ ఓటిటిల‌లో విడుద‌ల చెయ్య‌డానికి […]

డైరెక్ట్ ఓటిటిలో 'కేజీఎఫ్ 2' రిలీజ్..మూవీ యూనిట్ క్లారిటీ...
Follow us

|

Updated on: Jun 03, 2020 | 4:12 PM

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ నేప‌థ్యంలో గ‌త రెండు నెల‌లుగా సినిమా, సీరియ‌ల్ షూటింగ్స్ ఆగిపోయాయి. థియేట‌ర్స్ పూర్తిగా మూతప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో జ‌నాలు అధిక సంఖ్యలో డిజిట‌ల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలలో మూవీస్ చూడ‌టానికి అల‌వాటుప‌డ్డారు. కాగా సినిమాలు విడుద‌ల కాక‌పోవ‌డంతో.. ఫైనాన్స‌ర్ల ద‌గ్గ‌ర తెచ్చిన డ‌బ్బుల‌కు వ‌డ్డీ పెరి‌గిపోవ‌డంతో ప్రొడ్యూస‌ర్ల‌కు కూడా భారీగా న‌ష్టాలు వచ్చే ప‌రిస్థితులు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో కంప్లీట్ అయిన‌ చాలా సినిమాలను డైరెక్ట్ ఓటిటిల‌లో విడుద‌ల చెయ్య‌డానికి మేక‌ర్స్ మొగ్గు చూపారు. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌కి సంబంధించిన ప‌లు సినిమాలు డైరెక్ట్‌గా ఓటిటిల‌‌లో రిలీజ‌య్యాయి కూడా. తాజాగా క‌న్న‌డ సూప‌ర్ హిట్ మూవీ కేజీఎఫ్ సీక్వెల్ కూడా ఓటిటిలో విడుద‌ల అవుతుంద‌ని వార్తలు వెలువ‌డ్డాయి.

అమెజాన్ ప్రైమ్ భారీ డీల్ తో ఈ చిత్ర హ‌క్కుల‌ను ద‌క్కించుకుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ఈ వార్త‌ల‌ని ఖండించింది మూవీ టీమ్. ఓటీటీలో కేజీఎఫ్ 2లో రిలీజ్ చేసే అవ‌కాశం లేద‌ని క్లారిటీగా చెప్పేశారు. దీంతో ప్రచారాల‌కు తెర‌ప‌డింది.