ఎలివేషన్‌ బ్రహ్మ..టాలీవుడ్‌ ఆగమనం

KGF Director Prashanth Neel To Direct Movie In Telugu, ఎలివేషన్‌ బ్రహ్మ..టాలీవుడ్‌ ఆగమనం

గత ఏడాది విడుదలైన కన్నడ చిత్రం ‘కెజిఎఫ్’ చిత్రం సంచలనం విజయం సాధించింది.  విడుదలైన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ బోనాంజా సృష్టించింది. ఒక కన్నడ సినిమాకి ఈ స్థాయి క్రేజ్ రావడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా హీరోని ఎలివేట్ చేసే విషయంలో ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్..సౌత్ దర్శక ధీరులు రౌజమౌళి, శంకర్‌తో పోటీ పడ్డాడంటే అతిశయోక్తి కాదు. దీంతో అన్ని పరిశ్రమల్లోని నిర్మాతలు ప్రశాంతి నీల్‌ డైరెక్షన్లో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు.  వారిలో తెలుగు నిర్మాతలు కూడా ఉన్నారు.  వారే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు.  వీరు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమాని సైన్ చేయించినట్టు సమాచారం అందుతోంది.  అయితే ఆ సినిమా ఏ హీరోతో ఉంటుంది, ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ఉండబోతుంది అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.  ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ఛాఫ్టర్ 2 తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. బహుశా అది పూర్తయ్యాక తెలుగు ప్రాజెక్ట్ మొదలుకావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *