‘కేజీఎఫ్’ హీరో ముందడుగు.. ఆ ఊర్లు కరువును జయించాయి

Yash gives a solution to drought, ‘కేజీఎఫ్’ హీరో ముందడుగు.. ఆ ఊర్లు కరువును జయించాయి

ఎండకాలం వచ్చిందంటే నీటి ఎద్దడి అధికంగా ఎదుర్కొనే రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. అక్కడున్న మాండ్య, బీదర్, రాయ్‌చూర్ ప్రాంతాల్లో నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వేసవికాలంలో పంటలకు పక్కన పెడితే నిత్యావసరాలకు కూడా నీరు కష్టమవుతూ వస్తోంది. కొన్నేళ్ల నుంచి అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే దీనిని నిర్మూలించేందుకు అక్కడి రాజకీయ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కన్నడ నటుడు యశ్ ఓ ముందడుగు వేశారు. యశోమార్గ అనే ఓ ఫౌండేషన్‌ను ప్రారంభించిన ఈ హీరో.. కరువు నివారణ చర్యలను ప్రారంభించారు.

రెండేళ్ల క్రితమే ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయగా.. అందులో భాగంగా కాలువలను తవ్వించడం, చెరువుల చుట్టూ ట్యాంకులను కట్టించడం లాంటివి చేశారు. దీని ద్వారా నీటిని నిలువ చేయగా.. ప్రస్తుతం వాటర్ ట్యాంకర్ల ద్వారా మాండ్యా, బీదర్‌లోని పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీని వలన ఆయా ప్రాంతాల ప్రజలకు ఈ ఏడాది వేసవిలో నీటి ఎద్దడి నుంచి కాస్త ఊరట లభించింది. దీంతో యశ్ రియల్ హీరో అంటూ అక్కడి ప్రజలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫౌండేషన్ పనులు ఇలానే కొనసాగిస్తే.. రానున్న కొన్ని సంవత్సరాల్లో ఆయా ప్రాంతాల్లో కరువును పూర్తిగా జయించొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *