Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

ప్రారంభమైన ‘కేజీఎఫ్ 2’

, ప్రారంభమైన ‘కేజీఎఫ్ 2’

గతేడాది చివర్లో వచ్చిన కేజీఎఫ్ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది.  ఈ క్రమంలో ఈ మూవీ రెండో భాగాన్ని ఇవాళ ప్రారంభించారు.  బెంగ‌ళూరు కంఠీర‌వ స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఉద‌యం 9.30కు రెండో భాగాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. ప్ర‌ముఖ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ త‌న‌యుడు.. `కెజిఎఫ్ 2` ఎగ్జిక్యూటివ్ నిర్మాత కైకాల రామారావు, చిత్ర‌ నిర్మాత విజ‌య్ కిరంగ‌దూర్, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్, రాకింగ్ స్టార్ య‌శ్, క‌థానాయిక శ్రీ‌నిధి శెట్టి త‌దిత‌రులు ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు.

, ప్రారంభమైన ‘కేజీఎఫ్ 2’

ఈ నెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తారు. అక్టోబ‌ర్ తో చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. న‌వంబ‌ర్ నుంచి సీజీ వ‌ర్క్ స‌హా నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేస్తారు. 2020 వేస‌వి కానుక‌గా సినిమా రిలీజ‌వుతుంది. చాప్ట‌ర్ 1లో న‌టించిన స్టార్లు అంతా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. అలాగే బాలీవుడ్ కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖ స్టార్లు ఇందులో న‌టించనున్నారు. కెజిఎఫ్ చాప్ట‌ర్ 1 చిత్రాన్ని ఎంతో ప్రేమించి అభిమానించిన అభిమానుల‌కు చాప్ట‌ర్ 2 డ‌బుల్ ట్రీట్ ఇస్తుంద‌ని ఈ సందర్భంగా హీరో య‌శ్ తెలిపారు.

, ప్రారంభమైన ‘కేజీఎఫ్ 2’

, ప్రారంభమైన ‘కేజీఎఫ్ 2’

, ప్రారంభమైన ‘కేజీఎఫ్ 2’