స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో వెలుగులోకి కీల‌క విష‌యాలు !

విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ హోటల్ కోవిడ్ సెంట‌ర్ అగ్ని ప్రమాదం విష‌యంలో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో వెలుగులోకి కీల‌క విష‌యాలు !
Follow us

|

Updated on: Aug 11, 2020 | 11:32 AM

Vijayawada Fire Accident : విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ హోటల్ కోవిడ్ సెంట‌ర్ అగ్ని ప్రమాదం విష‌యంలో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ప్ర‌మాదం మొద‌లైన త‌ర్వాత‌… పూర్తిగా మంట‌లు, దట్టమైన పొగ పూర్తిగా వ్యాపించడానికి 30 నుంచి 45 నిమిషాల స‌మ‌యం ప‌ట్టి ఉండొచ్చ‌ని ఫైర్ ఆఫిస‌ర్స్ అంచనాకు వచ్చారు. అయితే తెల్ల‌వారుజామున స‌మ‌యం కావ‌డంతో అందరూ గాఢ నిద్రలో ఉండడం.. ఫైర్, పొగను గుర్తించి అలెర్ట్ చేసే వ్యవస్థ సరిగ్గా లేకపోవడం ఈ ఘోర ప్ర‌మాదానికి దారితీసిందని తేల్చారు. ఈ రెండింటిలో ఏది స‌రిగ్గా ఉన్నా ఫైర్‌ను స్టార్టింగ్‌లోనే గుర్తించి, దాన్ని కట్టడి చేసి బయ‌ట‌ప‌డేందుకు ఛాన్స్ ఉండేద‌ని నిర్ధారణకు వచ్చారు. రెండు రోజులుగా వివిధ కోణాల్లో ఘటనా స్థలంలో అనాల‌సిస్ చేస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఈ మేరకు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

అగ్నిమాపక శాఖ అధికారుల అంచ‌నా ప్రకారం… స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో ఎక్కువ భాగం ఉడ్‌తో చేసిన డిజైనింగ్ ఉంది. మంటలు దారాళంగా వ్యాపించ‌డానికి ఇదే ప్రధాన కారణమైంది. ఫాల్‌ సీలింగ్‌ వరకూ ఫైర్ వ్యాప్తి చెంద‌డంతో దట్టమైన పొగ మొత్తం ఆవ‌రించింది. రిసెప్షన్‌ పక్కనే బ్యాటరీలు, కంప్యూటర్లు, ఉన్నాయి. ప్రమాదినికి అక్క‌డే బీజం ప‌డి ఉండొచ్చు. అక్కడ వైరింగ్‌ అంతా పూర్తిగా కరిగిపోవ‌డంతో పాటు ప్రమాద తీవ్రత కూడా ఎక్కువ క‌నిపించింది. ఇది మెట్లు మార్గానికి పక్కనే ఉండటంతో మొదటి ఫ్లోర్‌లోకి దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్ల ఊపిరాడ‌క‌ ఎక్కువ మంది చనిపోయారు.

Also Read : తెలంగాణ : రైతు బీమా పథకం అమలు కోసం రూ.1173.54 కోట్లు విడుదల