మరికాసేపట్లో.. తెలంగాణ కేబినెట్ భేటీ.. ఇవే కీలకం..!

కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత కేబినెట్‌ సమావేశం ఉండటంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరికాసేపట్లో.. తెలంగాణ కేబినెట్ భేటీ.. ఇవే కీలకం..!
Follow us

|

Updated on: Aug 05, 2020 | 1:27 PM

Key Meeting of The Telangana Cabinet : స్కూల్స్ ఓపెన్ చేయడానికి సాధ్యాసాధ్యాలేంటి? రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు ఎలా ఉంది? కొత్త విద్యా విధానం ఎలా ఉండాలి? కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయా? ఇలా వివిధ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కాబోతుంది తెలంగాణ కేబినెట్.  కొత్త సచివాలయ నమునాను ఇప్పటికే ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత కేబినెట్‌ సమావేశం ఉండటంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణం, భవన నమూనాల అంశంపై ప్రధానంగా చర్చ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కరోనా వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ఇంకా ఎలాంటి యాక్షన్‌ ఉండాలన్న దానిపైన చర్చ జరుగుతుంది. విద్యా రంగంపైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కరోనా కారణంగా పలు ఎంట్రన్స్‌లు, డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని ఎప్పుడు నిర్వహించాలి, స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు తెరవాలన్న దానిపైనా మంత్రివర్గంలో చర్చ ఉండే అవకాశం ఉంది. కొత్త విద్యా విధానం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నియంత్రిత వ్యవసాయ విధానం, అమలవుతున్న తీరుపై సమీక్ష ఉండనుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ విధానాన్ని రైతులు పాటిస్తున్నారని భావిస్తోంది ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో దానిపై సమీక్షించి మరికొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది.

వీటితో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసు, రైతులకు కొత్త పథకం ప్రకటనపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ ఉంటుందని తెలుస్తోంది. ఉద్యోగులకు తీపికబురు అందుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..