Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజేంద్రనగర్ గ్రే హౌండ్స్ ప్రాంతంలో మళ్లీ చిరుత తిరుగుతూ సిసి కెమెరాకు చిక్కిన ఆనవాళ్లు. గ్రే హౌండ్స్ కాంపౌండ్ లోపల ఉన్నట్టు గుర్తింపు. 700ఎకరాల్లో పోలీస్ గ్రే హౌండ్స్ . గ్రే హౌండ్స్ ఉన్నతాధికారుల నుండి అనుమతి వచ్చిన తర్వాతే బొన్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్న అటవీశాఖ అధికారులు. గ్రే హౌండ్స్ చుట్టూ జూ సిబ్బంది, షూటర్స్, ట్రాప్ కెమెరా లతో అప్రమత్తం.
  • రెండు రాష్ట్రా ప్రభుత్వాలకు ఈనెల 4న జరిగే కృష్ణా నది యజమాన్య బోర్డు మీటింగ్ ఏజెండాలను పంపిన కృష్ణా నీటీ యాజమాన్య బోర్డ్. ఏజెండాలో ప్రధానంగా 5 అంశాల ప్రస్తావన. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టు లు , అభ్యంతరాలు , ప్రాజెక్టుల డీపీఆర్ లు.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • తూ. గో.జిల్లా: కోనసీమలో కరోన కలకలం. కోనసీమను గజ గజ లాడిస్తున్న ..ముంబై నుంచి వచ్చిన వలస కూలీలు . ఈరోజు ఒక్కరోజులో 28 కరోన పోసిటివ్ కేసులు నమోదు.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

సీఎం కేసీఆర్ ప్రసంగంలోని హైలెట్స్ ఇవే..!

Key Highlights of CM KCR Speech, సీఎం కేసీఆర్ ప్రసంగంలోని హైలెట్స్ ఇవే..!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. రూ. 1,46,492.30 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055.84 కోట్లు కాగా, మూలధన వ్యయం వ్యయం రూ. 17,274.67 కోట్లు. బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు రూ. 2,044.08 కోట్లుగా చూపించారు. బడ్జెట్‌లో ఆర్థిక లోటును 24,081 కోట్లుగా పేర్కొన్నారు. ప్రతి నెల గ్రామ పంచాయతీలకు రూ. 339 కోట్లు కేటాయించనున్నట్టు సీఎం కేసీఆర్ బడ్జెట్‌లో ప్రకటించారు. రైతు బంధు కోసం రూ. 12,000 కోట్లు కేటాయించారు. పంట రుణాల మాఫీ కోసం రూ. 6,000 కోట్లు కేటాయించినట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఇక శాసనమండలిలో ఆర్ధికమంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రెండో సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. తొలిసారి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రెండో ఆర్థికమంత్రిగా హరీష్ రావు రికార్డు సొంతం చేసుకోబోతున్నారు. కాగా, నేటి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక అంశాలు ఇవే..

1.ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించాం

2.దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సగర్వంగా నిలిచింది

3.ప్రభుత్వ ఆర్థిక విధానాలతో మూలధన వ్యయం పెరుగుతూ వచ్చింది

4. రూ. 1,65,167 కోట్ల మూలధనాన్ని వ్యయం చేశాం

5. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం

6. తెలంగాణలో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాం

7. రైతు బంధు, రైతుబీమాతో రైతులకు ఊరటనిచ్చాం

8. ప్రభుత్వ చర్యల వల్ల సుస్థిరమైన ఆర్థిక వృద్ధిరేటు నమోదైంది

9. వ్యవసాయరంగంలో 8.1 శాతం వృద్ధి రేటు నమోదైంది

10. పరిశ్రమలో 5.8 శాతం వృద్ధి సాధించాం

11. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

12. ఐటీలో 1.10 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు పెరిగాయి

13. పేద విద్యార్థులకు కార్పొరేషట్ విద్యను అందిస్తున్నాం

14. జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది

15. ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది

16. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గింది

17. ఆటోమొబైల్ రంగంలో 3 లక్షల మంది ఉపాధి కోల్పోయారు

18. 11 శాతం విమాన ప్రయాణికుల సంఖ్య పడిపోయింది

19. రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది

20. ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపయ్యింది

21. లక్షా పదివేల కోట్ల ఐటీ ఉత్పత్తులను సాధించాం

22. గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాం

23. రెవెన్యూ వ్యయం లక్షా 11 వేల 55 కోట్లు

24. మూలధన వ్యయం 17 వేల 574 కోట్లు

25. ఆర్థిక లోటు 24 వేల 81 కోట్లు

26. ఓటాన్ అకౌంట్‌లో లక్షా 82 వేల 17 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు

 

Related Tags