ముంబాయిలో మారణహోమానికి పాల్పడినందుకు అత్యున్నత పురస్కారం ఇవ్వండి

మారణహోమానికి తెగబడిన వారిని ఏం చేస్తారు? కఠిన శిక్షో, అంతకు మించి మరణశిక్షో విధిస్తారు. అదేమిటో కానీ ఆ పాతకానికి పాల్పడినందుకు తమకు అత్యున్నత పురస్కారం ఇవ్వాలంటున్నాడు తహవుర్‌ రాణా!

ముంబాయిలో మారణహోమానికి పాల్పడినందుకు అత్యున్నత పురస్కారం ఇవ్వండి
Follow us

|

Updated on: Dec 01, 2020 | 1:29 PM

మారణహోమానికి తెగబడిన వారిని ఏం చేస్తారు? కఠిన శిక్షో, అంతకు మించి మరణశిక్షో విధిస్తారు. అదేమిటో కానీ ఆ పాతకానికి పాల్పడినందుకు తమకు అత్యున్నత పురస్కారం ఇవ్వాలంటున్నాడు తహవుర్‌ రాణా! భారత్‌పై దాడి చేసి అమాయకుల ప్రాణాలు తీసుకున్నందుకు తనకే కాకుండా, ఆ దారుణకాండలో పాల్గొన్న తొమ్మిది మందికి కూడా పాక్‌ అత్యున్నత సైనిక పురస్కారాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడు.. 2008, నవంబర్‌ 26న ముంబాయిపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే కదా! ఆ ఉగ్రదాడి సంఘటనలో దోషి అయిన పాకిస్తాన్‌ సంతతికి చెందిన వ్యక్తే తహవుర్‌ రాణా. కెనడాకు చెందిన ఈ వ్యాపారి ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ఎంజెలస్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ ముష్కరుడిని తమకు అప్పగించాలంటూ భారత్‌ చేసిన విజ్ఞప్తి మేరకు జూన్‌ పదిన రాణాను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్‌లో రాణా గురించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ముంబాయి దాడులలో రాణాకు ప్రత్యక్ష ప్రమేయమున్నట్టు రుజువయ్యింది.. రాణాను తమకు అప్పగించాలంటూ భారత్‌ చేసిన విన్నపం సరైందేనన్నారు అటార్నీ నికోలా టీహన్నా.. ముంబాయి దాడులలో రాణాతో పాటు హెడ్లీ, లష్కరేకు చెందిన కొందరు ఉగ్రవాదులు, మరికొందరు దుండగులు పాల్గొన్నారు.. ఆ ఘటన తర్వాత కూడా రాణా, హెడ్లీలు తరచూ మాట్లాడుకున్నారట! ఇందులో హెడ్లీ చేసినదేమిటంటే దాడి జరిగిన ప్రదేశాలను వీడియో తీసి రాణాకు పంపడంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరంగా చెప్పడం.. ఇలా వీరిద్దరు సంభాషించుకోవడాన్ని అమెరికా ఎఫ్‌బీఐ పసిగట్టింది.. వారి మాటలను రికార్డు చేసింది.. దాడులలో చనిపోయిన తొమ్మిది మంది ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అత్యుతన్న సైనిక పురస్కారాన్ని అందించాలని, తనకు అత్యున్నత పౌర పురస్కారాలలో ఏదో ఒకటి ఇవ్వాలంటూ రాణా చేసిన డిమాండ్‌ను ఎఫ్‌బీఐ పసిగట్టింది. ఈ విషయాన్ని హెడ్లీ అప్పటికే పాకిస్తాన్‌లోని తమ సభ్యులకు తెలియచేశాడట! ఈ సంగతి తెలుసుకుని రాణా తెగ సంతోషించాడట! ముంబాయి దాడుల తర్వాత కూడా వారు కుట్రలు చేస్తూనే వచ్చారని హన్నా వివరించారు. ఆ మరుసటి ఏడాది అంటే 2009లోనూ భారత్‌పై దాడులు చేయడానికి ప్రయత్నించారట. డెన్మార్క్‌లో దాడులకు ప్రయత్నించింది కూడా ఈ ముఠానేనని చెప్పారు. ఆ ఏడాది అక్టోబర్‌ మూడున షికాగోలో హెడ్లీని అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన ఆరు నెలల తర్వాత హెడ్లీ తన నేరాలను ఒప్పుకున్నాడు. విచారణలో సహకరిస్తానని అమెరికా ప్రభుత్వంతో తెలిపాడు.. సుదీర్ఘ విచారణ తర్వాత హెడ్లీకి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఇల్లినాయిస్‌ కోర్టు. రాణా పేరుగడించిన వ్యాపారి కావడం హెడ్లీకి కలిసివచ్చింది..అతడి వ్యాపారాలను అడ్డం పెట్టుకుని హెడ్లీ పలు దేశాలకు వెళ్లి వచ్చాడు. భారత్‌లో కూడా అలాగే అడుగుపెట్టాడు. అనేకసార్లు తన వీసాను పడిగించుకున్నాడు. ముంబాయిలోని తాజ్‌ హోటల్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలను వీడియో తీసి లష్కరే ఉగ్రవాదులకు చూపించాడు హెడ్లీ.. వారి ఆదేశాలను పాటిస్తూ 2007, ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చాడు.. ఆయా ప్రాంతాలలో రెక్కీ నిర్వహించాడు.. ఇవన్నీ హన్నా ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!