బిగ్ బాస్3 షో ని బ్యాన్ చేయాలి: విజయవాడలో కేతిరెడ్డి ధర్నా

బిగ్ బాస్3 రియాల్టీ షో ప్రారంభమైన మొదటి నుంచి విమర్శలు ఎదుర్కుంటోంది. ఈ షోని నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పలువురు ప్రముఖులు పిటిషన్ కూడా వేశారు. అయినప్పటికీ అనుకున్న సమయానికి షో ప్రారంభం అయింది. అయితే ఈరోజు బిగ్ బాస్ 3 ప్రసారాలు నిలిపివేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద తెలుగు యువశక్తి అధ్యక్షుడు, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ధర్నా చేపట్టారు. బిగ్ బాస్ షో ని బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ […]

బిగ్ బాస్3 షో ని బ్యాన్ చేయాలి: విజయవాడలో కేతిరెడ్డి ధర్నా
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2019 | 1:53 PM

బిగ్ బాస్3 రియాల్టీ షో ప్రారంభమైన మొదటి నుంచి విమర్శలు ఎదుర్కుంటోంది. ఈ షోని నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పలువురు ప్రముఖులు పిటిషన్ కూడా వేశారు. అయినప్పటికీ అనుకున్న సమయానికి షో ప్రారంభం అయింది. అయితే ఈరోజు బిగ్ బాస్ 3 ప్రసారాలు నిలిపివేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద తెలుగు యువశక్తి అధ్యక్షుడు, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ధర్నా చేపట్టారు. బిగ్ బాస్ షో ని బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ షో నిర్వహించడం చట్ట విరుద్దమని ఆయన ఆరోపిస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నా చేశాం. ఈ రోజు ఏపీ రాజధానిలో ధర్నా చేపట్టామన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువత చెడు మార్గంలోకి వెళుతున్నారని ఆయన అన్నారు. బిగ్ బాస్ షోని బ్యాన్ చేసేవరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని కేతిరెడ్డి తేల్చిచెప్పారు. అన్నమయ్య, షిరిడి సాయి లాంటి సినిమాల్లో నటించిన సినీనటుడు నాగార్జున ఇలాంటి షోలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.