జగన్‌ని పొగిడేసిన కేశినేని.. జంపింగ్ ఖాయమేనా ?

అటు ఎన్నికలు ముగిశాయో లేదు.. ఏపీ వార్తల్లో అతిగా నానిన వ్యక్తి, నేత, నాయకుడు ఎవరూ అంటే ఠక్కున గుర్తొచ్చేది విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని పేరే. ఆయనది ఒకప్పుడు ట్రావెల్స్‌ బిజినెస్‌. కానీ కాలం కలసి రాక ఆపేశారు. కానీ ఆ పొలిటికల్‌ బస్సు మాత్రం అదే రూట్లో వెళుతోంది. హైవేపై గజిబిజీ ప్రయాణం సాగుతోంది. ఒకసారి ఓ స్టేజీలో ఆగుతుంది. మరోసారి వేరే స్టేజీలో హారన్‌ మోగిస్తోంది. ఇంతకీ ఆయన పొలిటికల్‌ ట్రావెల్‌ […]

  • Rajesh Sharma
  • Publish Date - 12:44 pm, Thu, 7 November 19
అటు ఎన్నికలు ముగిశాయో లేదు.. ఏపీ వార్తల్లో అతిగా నానిన వ్యక్తి, నేత, నాయకుడు ఎవరూ అంటే ఠక్కున గుర్తొచ్చేది విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని పేరే.
ఆయనది ఒకప్పుడు ట్రావెల్స్‌ బిజినెస్‌. కానీ కాలం కలసి రాక ఆపేశారు. కానీ ఆ పొలిటికల్‌ బస్సు మాత్రం అదే రూట్లో వెళుతోంది. హైవేపై గజిబిజీ ప్రయాణం సాగుతోంది. ఒకసారి ఓ స్టేజీలో ఆగుతుంది. మరోసారి వేరే స్టేజీలో హారన్‌ మోగిస్తోంది. ఇంతకీ ఆయన పొలిటికల్‌ ట్రావెల్‌ రూటు మారుతుందా? ఇటీవల ఆయన ధోరణి, చేస్తున్న కామెంట్లు ఇలాంటి చర్చకు మరోసారి తెరలేపాయి.
కేశినేని నాని. బెజవాడ టీడీపీ ఎంపీ. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి దక్కించుకున్న మూడంటే మూడు ఎంపీ సీట్లలో విజయవాడ ఒకటి. టిడిపి తరపున గెలిచిన ముగ్గురంటే ముగ్గురు లోక్ సభ సభ్యుల్లో కేశినేని నాని ఒకరు. కానీ ఈయన ఈమధ్య వార్తల్లో ఎక్కువగా ఉంటున్నారు. మొన్నటి దాకా ప్రెస్‌మీట్లతో హడావుడి చేశారు. ఆతర్వాత ట్వీట్లతో పార్టీలో మంటలు రేపారు. ఇప్పుడు రూటు మార్చి మాట్లాడుతున్నారు. దీంతో కేశినేనికి ఏమైంది? అని బెజవాడ జనం చర్చించుకుకున్నారు.
ఎంపీ నిధులతో ఇటీవల విజయవాడలో నిర్మించిన భవన ప్రారంభోత్సవంలో కేశినేని పాల్గొన్నారు.  వైసిపి నేతల సమక్షంలోనే సీఎం జగన్ పై,మంత్రులపై పొగడ్తల వర్షం కురిపించారు నాని.  కేశినేని నాని ఇప్పుడు సీఎం జగన్‌ను పొగడటం టీడీపీలో కలకలం రేపుతోంది. సీనియర్లే ఇలా పార్టీ లైన్‌ దాటి మాట్లాడితే ఎలా అని కొందరు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయాన్ని సీనియర్లు పార్టీ అధిష్టానం తీసుకువెళ్లారట.
అయితే అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో ఇతర నేతలు అప్‌సెట్‌ అయ్యారట. మరోవైపు వల్లభనేని రాజీనామా ఎపిసోడ్‌లో కూడా అధిష్టానం సరిగ్గా వ్యవహరించ లేదని కొందరు సీనియర్లు విమర్శిస్తున్నారు. మొత్తానికి పార్టీ లైన్‌ దాటి ప్రవర్తిస్తున్న నేతలపై అధిష్టానం సీరియస్‌గా ఉండాలని మిగతా నేతలు సూచిస్తున్నారు.