గౌరవనీయులైన సీఎం జగన్‌కు సూటి ప్రశ్న..!

ఈ మధ్య టీడీపీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలోనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎవరికైనా ట్వీట్లతోనే సమాధానిమిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేసిన అనంతరం.. సీఎం చంద్రబాబు ఇల్లు సహా అక్రమ కట్టడాలుగా పేర్కొన్న 60 లేదా 70 ఇళ్లకు సీఎం నోటీసులు పంపించిన నేపథ్యంలో కేశినేని నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘గౌరవనీయులైన సీఎం జగన్‌ గారికి సూటి ప్రశ్న అంటూ.. నదీపరీవాహక ప్రాంతాలలో అక్రమంగా ఉన్న కట్టడాలను తొలగించాలని గట్టి నిర్ణయంతో ఉన్న ఏపీ ప్రభుత్వం.. […]

గౌరవనీయులైన సీఎం జగన్‌కు సూటి ప్రశ్న..!
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 10:31 AM

ఈ మధ్య టీడీపీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలోనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎవరికైనా ట్వీట్లతోనే సమాధానిమిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేసిన అనంతరం.. సీఎం చంద్రబాబు ఇల్లు సహా అక్రమ కట్టడాలుగా పేర్కొన్న 60 లేదా 70 ఇళ్లకు సీఎం నోటీసులు పంపించిన నేపథ్యంలో కేశినేని నాని ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘గౌరవనీయులైన సీఎం జగన్‌ గారికి సూటి ప్రశ్న అంటూ.. నదీపరీవాహక ప్రాంతాలలో అక్రమంగా ఉన్న కట్టడాలను తొలగించాలని గట్టి నిర్ణయంతో ఉన్న ఏపీ ప్రభుత్వం.. కేవలం చంద్రబాబు ఉన్న నదీపరీవాహక కట్టడాలనే తొలగిస్తారా..? లేదా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని కట్టడాలను తొలగిస్తారా..? అంటూ ప్రశ్నించారు.’

కాగా.. తాజాగా.. ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ.. తాజ్‌మహల్ యమున నది ఒడ్డున ఉంది కాబట్టి సరిపోయింది.. అదే కృష్ణా నది ఒడ్డున ఉంటే..? అంటూ ట్వీట్ చేశారు.