నాని ‘పోరాట బాట’ ట్వీట్..! వాట్ నెక్ట్స్..?

టీడీపీ అధినేత ఇచ్చిన లోక్‌సభ విప్ పదవి వద్దని, అందుకు నేను అర్హుడిని కాదని, తనకు ఏ పదవి వద్దని పార్టీలోనే ఉంటానని చెప్పారు ఎంపీ కేశినేని నాని. అయితే.. బుధవారం గల్లా జయదేవ్ నానితో సమావేశం కాగా.. నాని సరిగా స్పందించలేదని సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ట్విట్టర్‌లో ‘పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప..’ అనే కామెంట్ పోస్ట్ చేశారు.

ఆయనను బుజ్జగించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం తనను కలుసుకోవాల్సిందిగా మాజీ సీఎం చంద్రబాబు చేసిన ఫోన్‌ కాల్‌తో నాని ఆయనతో కొద్దిసేపు కలిసి తన మనసులో మాటను చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ భేటీ ముక్తసరిగా ముగిసినట్టు తెలిసింది. తన రాజకీయ భవితవ్యంపై నాని మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *