కొడాలి.. నిన్ను మంత్రిని చేసింది ఆయనే…కేశినేని వ్యంగ్యాస్త్రాలు

విజయవాడ : ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయం చెందినప్పటి నుంచి ఆ పార్టీ విజయవాడ ఎంపీ  కేశినేని నాని వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మెన్నీమధ్య సొంత పార్టీలో చంద్రబాబు చుట్టూ ఉండే కోటరీపై విమర్శలు చేసిన ఆయన..తాజాగా తన జిల్లాకే చెందిన.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును లక్ష్యంగా చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మరో రాజకీయ దుమారానికి తెరలేపింది. దేవినేని ఉమకు కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలంటూ తాజాగా కేశినేని నాని […]

కొడాలి.. నిన్ను మంత్రిని చేసింది ఆయనే...కేశినేని వ్యంగ్యాస్త్రాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 10, 2019 | 4:44 PM

విజయవాడ : ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయం చెందినప్పటి నుంచి ఆ పార్టీ విజయవాడ ఎంపీ  కేశినేని నాని వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మెన్నీమధ్య సొంత పార్టీలో చంద్రబాబు చుట్టూ ఉండే కోటరీపై విమర్శలు చేసిన ఆయన..తాజాగా తన జిల్లాకే చెందిన.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును లక్ష్యంగా చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మరో రాజకీయ దుమారానికి తెరలేపింది.

దేవినేని ఉమకు కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలంటూ తాజాగా కేశినేని నాని పోస్ట్ చేశారు. దేవినేని వల్లే కృష్ణా జిల్లా నుంచి కొడాలి నానికి మంత్రి అయ్యే అవకాశం దక్కిందని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇటీవలే అధినేత చంద్రబాబుతో సమావేశమై తాను గత అయిదేళ్లలో పార్టీలో ఏ విధంగా ఇబ్బందులు పడిందీ వివరించారు. ఇవాళ మరో పోస్టు పెట్టడంతో నాని ఆంతర్యం ఏమిటన్నది తెలుగుదేశంలో ప్రశ్నార్థకంగా మారింది.

https://www.facebook.com/Kesineninani.TDPVijayawada/posts/1220647721449425