జెసిందా ఆర్డెర్న్‌ కేబినెట్‌లో ప్రియాంక

న్యూజిలాండ్‌ కేబినెట్‌లో ఓ భారతీయ మహిళకు చోటు దక్కింది.. ప్రధానమంత్రి జెసిందా ఆర్డెర్న్‌ మంత్రివర్గంలో భారతీయ మహిళ ప్రియాంక రాధాకృష్ణన్‌కు చోటు లభించింది.. న్యూజిలాండ్‌లో మంత్రి పదవి సంపాదించుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పారు ప్రియాంక.. 41 ఏళ్ల ప్రియాంక రాధాకృష్ణన్‌ కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్‌ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు.. చెన్నైలో జన్మించిన ప్రియాంక అచ్చమైన మలయాళి. కేరళలోని ఎర్నాకుళం జిల్లా పరపూర్‌ వాళ్ల స్వస్థలం.. అయితే ప్రియాంక చదువుకున్నది మాత్రం సింగపూర్‌, న్యూజిలాండ్‌లలో. […]

  • Balu
  • Publish Date - 2:53 pm, Mon, 2 November 20

న్యూజిలాండ్‌ కేబినెట్‌లో ఓ భారతీయ మహిళకు చోటు దక్కింది.. ప్రధానమంత్రి జెసిందా ఆర్డెర్న్‌ మంత్రివర్గంలో భారతీయ మహిళ ప్రియాంక రాధాకృష్ణన్‌కు చోటు లభించింది.. న్యూజిలాండ్‌లో మంత్రి పదవి సంపాదించుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పారు ప్రియాంక.. 41 ఏళ్ల ప్రియాంక రాధాకృష్ణన్‌ కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్‌ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు.. చెన్నైలో జన్మించిన ప్రియాంక అచ్చమైన మలయాళి. కేరళలోని ఎర్నాకుళం జిల్లా పరపూర్‌ వాళ్ల స్వస్థలం.. అయితే ప్రియాంక చదువుకున్నది మాత్రం సింగపూర్‌, న్యూజిలాండ్‌లలో. ఆ తర్వాత ఆమె క్రైస్ట్‌చర్చ్‌కు చెందిన రిచర్డ్‌సన్‌ను పెళ్లి చేసుకున్నారు.. 2004 నుంచి లేబర్‌పార్టీలో చురుకైన పాత్రను పోషిస్తూ వస్తున్న ప్రియాంక 2017లో తొలిసారిగా న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.. మొన్నటి ఎన్నికల్లో రెండోసారి కూడా ఎంపీగా ఎన్నికయ్యారు.. ఇంతకు ముందు వారసత్వ శాఖకు పార్లమెంటరీ ప్రయివేటు కార్యదర్శగా కూడా పని చేసిన ప్రియాంక మన తెలుగువారికి కూడా సుపరిచతమే! లాస్టియర్‌ ఆక్లాండ్‌లో జరిగిన బతుకమ్మ సంబరాలలో పాల్గొనడమే కాకుండా సిరిసిల్ల చీక కట్టుకుని బతుకమ్మ ఆడారు. సిరిసిల్ల బతుకమ్మ చీరకు ప్రచారకర్తగా కూడా వ్యవహరించారు.

జనవరిలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్‌ను కూడా కలుసుకున్నారు. న్యూజిలాండ్‌, తెలంగాణ మధ్య పరస్పర సహకారంపై చర్చించుకున్నారు. వెల్లింగ్టన్‌లోని విక్టోరియా యూనివర్సిటీ నుంచి డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ను పూర్తి చేసుకున్న ప్రియాంకకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి. ఆక్లాండ్‌లోని ఇండియన్‌ కమ్యూనిటీలో సోషల్‌ వర్కర్‌గా కూడా పని చేశారామె! ఓ రకంగా రాజకీయం ఆమె రక్తంలోనే ఉంది.. ఎందుకంటే ఆమె తాతముత్తాతలు కూడా రాజకీయాల్లోఉన్నవారే! లెఫ్ట్‌ వింగ్‌ రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు.
కేరళ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడేందుకు జరిగిన ఉద్యమంలో ఈమె తాత కీలక పాత్ర వహించారు.. న్యూజిలాండ్‌లోని లేబర్‌పార్టీ విధానాలు నచ్చడంతో ప్రియాంక ఆ పార్టీలో చేరారు.