Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 936181 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 319840 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 592032 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 24309 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా వ్యాక్సిన్ పై నిమ్స్ లో ప్రారంభమైన క్లినికల్ ట్రయల్స్. నిన్న ఆరుగురి నుండి రక్త నమూనాలు సేకరించి ఢిల్లీ ఐసీఎమ్ఆర్కు పంపిన నిమ్స్ వైద్యులు. రెండు రోజుల్లో నిమ్స్ కు రానున్న రిపోర్ట్స్. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వారిపై కు వ్యాక్సిన్ మొదటి డోసు ప్రయోగించనున్న వైద్యులు. నిమ్స్ లో రెండు రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణ. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా క్లినికల్ ట్రయల్స్ ప్రయోగం.
  • సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల. www.cbseresults.nic, www.cbse.nic.in వెబ్‌సైట్లలో ఫలితాలు . ఉమాండ్‌ మొబైల్‌ యాప్‌, 011-24300699 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా రిజల్ట్స్‌ తెలుసుకునే అవకాశం. కరోనా నేపథ్యంలో ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా ఫలితాలను విడుదల చేసిన సీబీఎస్ఈ.
  • కృష్ణా నది ఎగువ ప్రాంతంలో అధిక వర్షాల మూలంగా ప్రకాశం బ్యారణ్ కి అధికంగా చేరుతున్న నీరును దిగువకు విడుదల. కృష్ణా నదీ, పరివాహక ప్రాంతములలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కీసర, మున్నేరు, వైర, కట్లేరు తదితర కృష్ణా నది ఎగువ నదీ పరీవాహక ప్రాంతాలలో పడిన అధిక వర్షాలు ప్రకాశం బ్యారేజ్ లోనికి వస్తున్న నీరు. ప్రకాశం బ్యారజ్ వద్ద 12 అడుగుల లెవెల్ మైంటైన్ చేస్తూ దిగువకు నీరు విడుదల. అప్రమత్తమైన రేవెన్యూ, పోలీసు, ముత్తు పశుసంవర్థక శాఖ, పంచాయతీ, ఇరిగేషన్ శాఖల అప్రమత్తం.
  • తెలంగాణలో మళ్లీ మావోల అలజడి. అధికార పార్టీ ఎమ్మెల్యేల టార్గెట్‌ చేస్తూ మావోల యాక్షన్‌ ఫ్లాన్‌. ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత పెంపు. ఏజెన్సీ ప్రాంతాలలో ముందస్తు సమాచారం లేకుండా పర్యటించొద్దని ప్రజాప్రతినిధులకు పోలీసుల సూచన.
  • విజయవాడ: Tv9తో సీపీ శ్రీనివాసులు. 400 మందికి పైగా రౌడిసషీటర్లను బెజవాడలో గుర్తించాం. 70 మంది రౌడిషీటర్ల నగరంలో యాక్టివ్ గా ఉన్నట్టు గుర్తించాం. రాత్రిపూట వారి కదలికలపై నిఘా పెట్టాం. నలుగురు రౌడిసీటర్లను నగర బహిష్కరణ చేశాం. నగర బహిష్కరణకు మరికొందరిని లిస్ట్ ఔట్ చేశాం.. రౌడిషీటర్లు గంజాయి , డ్రగ్స సేవిస్తున్నారు. విద్యార్థులే లక్ష్యంగా గంజాయి , డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. చాలామంది విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

మహిళపై భర్త, నలుగురు స్నేహితుల లైంగికదాడి

కేరళ లో దారుణం జరిగింది. ఓ మహిళపై తన భర్త, నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరువనంతపురం జిల్లా వెటుత్తర బీచ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది.
Kerala woman was tortured and gang-raped by her husband and his friends at thiruvananthapuram district, మహిళపై భర్త, నలుగురు స్నేహితుల లైంగికదాడి

కేరళ లో దారుణం జరిగింది. ఓ మహిళపై తన భర్త, నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరువనంతపురం జిల్లా వెటుత్తర బీచ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. సిగరెట్ వాతలు పెడుతూ హింసిస్తూ కిరాతకాన్ని ప్రదర్శించారు దుర్మార్గులు.
వెటుత్తరలో 25 ఏళ్ల మహళ, తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటోంది. తాజాగా వెటుత్తర బీచ్ కి సరదా కోసం పిల్లలతో కలిసి దంపతులిద్దరూ వెళ్లారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న స్నేహితుడి ఇంటికి వారిని తీసుకుని వెళ్లాడు భర్త. అక్కడ బాధితురాలి చేత బలవంతంగా మద్యం తాగించారు భర్తతో పాటు అతని స్నేహితులు. ఆపై అతి కిరాతకంగా సిగరెట్ తో వాతలు పెడుతూ కన్న కొడుకు ఎదుటే భర్తతో సహా అతని నలుగురు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. గాయాలతో, స్పృహలేని స్థితిలో రోడ్డుపై పడి ఉన్న బాధితురాలిని ఓ యువకుడు గమనించి ఇంటికి చేర్చాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. బాధితురాలకి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

Related Tags