నాడు మోదీని తిట్టాడు.. నేడు ఉద్యోగం పోయింది..!

Kerala Teacher Who Works In Kurnool Lost His Job For Posting Abusive Language On Pm Modi, నాడు మోదీని తిట్టాడు.. నేడు ఉద్యోగం పోయింది..!

ప్రధాని నరేంద్ర మోదీని పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కారణంగా ఓ కేరళ వాసి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. కేరళకు చెందిన శిజు జయరాజ్ కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం.. తన ఫేస్‌బుక్ లో ప్రధాని మోదీపై అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టు పెట్టాడు. అది కాస్త వైరల్ అయింది. బీజేపీ కార్యకర్తలు, మోదీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనిపై కేరళలోని బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడు తన ఫేస్ బుక్ అకౌంట్ ఎవరో వ్యాక్ చేశారంటూ వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత తన తప్పుకి క్షమాపణ కోరుతూ మరో పోస్టు చేశాడు. తనకు ప్రధాని మోదీ అంటే గౌరవం ఉందని, తాను చేసిన ఒక తప్పును మన్నించాలని కోరాడు. అయితే, అప్పటికే ఉద్యోగం ఊడిపోయింది. శిజు జయరాజ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అతడు చేసిన పోస్టు వల్ల స్కూల్ పేరు దెబ్బతింటుందని భావించిన స్కూల్ యాజమాన్యం అతడిని సస్పెండ్ చేసింది. జయరాజ్ వ్యక్తిగత పోస్టుతో తమకు సంబంధం లేదని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *