ఆరు జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్‌.. ఇడుక్కిలో 48కి చేరిన మృతులు!

భారీ వర్షాల కారణంగా కేరళలో జనజీవనం స్తంభించిపోయింది. ఇడుక్కిలో కొండ‌చరియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మ‌రింత పెరిగింది. ఘ‌ట‌నా ప్రాంతంలోని శిథిలాల నుంచి ఆదివారం మ‌రో 16 మృతదేహాల‌ను వెలికి తీయడంతో మొత్తం మృతుల సంఖ్య 43కు చేరింది.

ఆరు జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్‌.. ఇడుక్కిలో 48కి చేరిన మృతులు!
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 1:25 PM

Kerala Rains: భారీ వర్షాల కారణంగా కేరళలో జనజీవనం స్తంభించిపోయింది. ఇడుక్కిలో కొండ‌చరియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మ‌రింత పెరిగింది. ఘ‌ట‌నా ప్రాంతంలోని శిథిలాల నుంచి ఆదివారం మ‌రో 16 మృతదేహాల‌ను వెలికి తీయడంతో మొత్తం మృతుల సంఖ్య 48కి చేరింది. కేర‌ళ‌లో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో గ‌త శుక్ర‌వారం ఇడుక్కి జిల్లాలోని రాజ‌మలలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఎక్కడ చూసినా నీటితో మునిగిపోయిన‌ రోడ్లు, వర్షపునీటిలో చిక్కుకున్న ఇళ్లే కనిపిస్తున్నాయి. దీనికితోడు కేర‌ళ‌లో వ‌చ్చే 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురుస్తామని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో కాసరగోడ్, కన్నూర్ , వయనాడ్, కోజికోడ్, మలప్పురం, అలప్పుజ జిల్లాల్లో ప్ర‌భుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. నిరంతర వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.

[svt-event date=”10/08/2020,12:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారా కరోనా టెస్ట్..!

తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌..!