కేరళ విమాన ప్రమాదం: సహాయక చర్యల్లో పాల్గొన్న వారు.. క్వారంటైన్‌లోకి!

నిన్న కేరళలో జరిగిన ఘోర విమాన ప్రమాద సంఘటనలో.. సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరూ క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో

కేరళ విమాన ప్రమాదం: సహాయక చర్యల్లో పాల్గొన్న వారు.. క్వారంటైన్‌లోకి!
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 1:25 PM

Kerala plane crash: నిన్న కేరళలో జరిగిన ఘోర విమాన ప్రమాద సంఘటనలో.. సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరూ క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని, అందుకే క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని సూచించింది. మిగితా ప్రయాణికులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే దశలోనే ఉన్నామని అధికారులు ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, వారందరికీ ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుతున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు.

సహాయక చర్యల్లో.. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, వలంటీర్లు, హెల్త్ కార్యకర్తలు, పోలీస్, ఫైర్, మీడియా, స్థానికులు.. ఇలా అందరూ కలిసి పనిచేస్తున్నారు. వీరిలో కొందరు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని తమ దృష్టికి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ‘‘సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరూ క్వారంటైన్‌లోకి వెళ్లిపోండి. వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తాం. స్వచ్ఛందంగా వారందరూ స్థానికంగా ఉండే ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించాలి’’ అని ఆరోగ్య మంత్రి శైలజ సూచించారు.

[svt-event date=”08/08/2020,1:22PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

ఏపీలోని ఆ జిల్లాల్లో.. మరోసారి కఠిన లాక్‌డౌన్..?

జగన్ కీలక నిర్ణయం.. సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ బెడ్స్..!