‘ మావాళ్లను గుర్తు పట్టాం ‘ ‘ ఐసిస్ ‘ పిల్లల తల్లుల భావోద్వేగం

ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని రోజులక్రితం భద్రతా దళాలకు లొంగిపోయిన ఐసిస్ ఉగ్రవాదుల్లో ఉన్నవారిలో తమ పిల్లలను తాము గుర్తు పట్టామని కేరళకు చెందిన ఓ మహిళ, తమిళనాడులోని పొలాచ్చికి చెందిన మరో మహిళ చెబుతున్నారు. ఓ ఫొటోలో తన కూతురును, అల్లుడ్ని, మనుమరాలిని గుర్తు పట్టినట్టు కేరళ.. తిరువనంతపురంలో నివసించే బిందు సంపత్ అనే మహిళ తెలిపింది. ఈ ఫోటోలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ ఐ ఏ) విడుదల చేసింది. పొలాచ్చి వాసి అయిన గ్రేసీ […]

' మావాళ్లను గుర్తు పట్టాం ' ' ఐసిస్ ' పిల్లల తల్లుల భావోద్వేగం
Follow us

|

Updated on: Nov 28, 2019 | 7:43 PM

ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని రోజులక్రితం భద్రతా దళాలకు లొంగిపోయిన ఐసిస్ ఉగ్రవాదుల్లో ఉన్నవారిలో తమ పిల్లలను తాము గుర్తు పట్టామని కేరళకు చెందిన ఓ మహిళ, తమిళనాడులోని పొలాచ్చికి చెందిన మరో మహిళ చెబుతున్నారు. ఓ ఫొటోలో తన కూతురును, అల్లుడ్ని, మనుమరాలిని గుర్తు పట్టినట్టు కేరళ.. తిరువనంతపురంలో నివసించే బిందు సంపత్ అనే మహిళ తెలిపింది. ఈ ఫోటోలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ ఐ ఏ) విడుదల చేసింది. పొలాచ్చి వాసి అయిన గ్రేసీ థామస్ అనే మరో మహిళ.. తన కొడుకు చేతులు, నుదురు గుర్తు పట్టానని, అతడు తన కుమారుడేననడంలో ఏ మాత్రం అనుమానం లేదని అంటోంది. తమవాళ్లు త్వరలో తమను చేరుకోగలరని వీరు గంపెడంత ఆశతో ఉన్నారు. సుమారు మూడేళ్ళ క్రితం కేరళ నుంచి దాదాపు 21 మంది ఐసిస్ లో చేరేందుకు ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్ వంటి దేశాలకు తమ కుటుంబాలతో సహా వెళ్లిపోయారు. అయితే ఇటీవలే సుమారు 900 మంది తమ ఆయుధాలతో సహా ఆఫ్ఘనిస్థాన్ లో సెక్యూరిటీ దళాలకు లొంగిపోయారు. వీరిలో ఎక్కువమంది పాకిస్థానీయులు కాగా.. కేరళకు చెందిన పది, పన్నెండు మంది కూడా ఉన్నారు. కాగా- తన కుమార్తె, అల్లుడు తరచూ తమ ఫోటోలను, వాయిస్ రికార్డింగులను తనకు పంపుతుంటారని, వాటి ద్వారా ఈ ఫోటోల్లో వారిని గుర్తు పట్టానని బిందు సంపత్ పేర్కొంది. చివరిసారిగా గత ఏడాది నవంబరు 26 న వారి గొంతులను ఆమె విన్నదట. వాళ్లకు ఇష్టమైన వంటలు, దోసె, కర్రీ చేసి పెడతానని, ఎంత త్వరగా వాళ్ళు వస్తే తాను అంతగా సంతోషిస్తానని ఆమె చెబుతోంది.