Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • మాస్కులు , శానిటైజర్స్ కొరత పై స్పందించిన మానవ హక్కుల కమిషన్. మీడియా కథనాలను సుమోటో గా స్వీకరించిన హెచ్చార్సీ. కోవిడ్ వారియర్స్ ఫ్రైంట్ లైన్ వారియర్స్కు సరఫరాలో లోపం పై ఆగ్రహం. పారిశుద్య , ఎంటమాలజీ సిబ్బందికి రక్షణ వస్తువులు ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టిన హెచ్చార్సీ. మాస్కులు , శానిటైజర్ల సరఫరాపై ఈ నెల 28లోగా కమీషన్ ముందు వివరణ ఇవ్వాలని జిహెచ్ఎంసి కమిషనర్ కు ఆదేశాలు.
  • నిమ్స్ లో కరోనా కలకలం . టెస్టింగ్ ల్యాబ్ సిబ్బంది ముగ్గురికి కరోనా పాజిటివ్ . మిల్లినియం బ్లాక్ నుండి ఐటిఎమర్ భవనానికి ల్యాబ్ ని టెస్టుల ప్రక్రియ కోసం మార్చడం తో బాధితులు గా మారుతున్న ల్యాబ్ సిబ్బంది .
  • కర్నూలు: నంద్యాలకు చెందిన బ్యాంక్ ఉద్యోగి కరోనాతో మృతి. మృతి చెందిన వ్యక్తి శిరివెళ్ళ మండలం యర్రగుంట్ల స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం . మృతి చెందిన వ్యక్తి కరోనా టెస్ట్ చేయించుకో గా కరోనా నిర్దారణ. పరిస్థితి విషమంగా ఉండగా కర్నూలు తరలిస్తూండగా కోలుకోలేక మృతి.
  • వరంగల్: నేడు సంపూర్ణ శాకాంబరీగా దర్శనమిస్తున్న భద్రకాళి అమ్మవారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు ఆంక్షల మధ్య ఉత్సవాలు. భక్తులు ఎవరూ అమ్మవారికి కూరగాయలు తీసుకురావద్దని విజ్ఞప్తి. నిరాడంబరంగా ఉత్సవాలు.. నేరుగా తోట నుండి కూరగాయలు సేకరించి అమ్మవారిని సంపూర్ణ శాకాంబరీగా అలంకరించిన ఆలయ పూజారులు. సాయంత్రం 8గంటల వరకే దర్శనాలు.
  • చెన్నై మహానగరాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ,వెయ్యి మందికి పైగా మృతి . రాష్ట్రవ్యాప్తం గా 13 జిల్లాలో చెన్నై లోనే కరోనా బాధితుల సంఖ్య వేగం గా పెరుగుతుంది . రోజు వేల సంఖ్యలో కేసులు నమోదుకావడం తో ఇప్పటివరకు 66 వేల 538 మంది కి కరోనా నిర్ధారణ . చెన్నైనగరం లో కరోనా మహమ్మారికి 1 ,033 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడి .
  • తెలంగాణ కరోనా కేసుల అప్డేట్స్: 17వేల మార్క్ కు చేరువలో జిహెచ్ఎంసి కేసులు. రాష్ట్రంలో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు 1850. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 22312. జిహెచ్ఎంసి పరిధిలో - 1572. ఈరోజు కరోనా తో చనిపోయిన వారు - 5. టోటల్ డెత్స్ - 288 చికిత్స పొందుతున్న వారు- 10487. డిశ్చార్జి అయిన వారు -11537.

కట్నం కోసం కాలనాగుతో భార్యను చంపిన భర్త

Kerala Man Kills Wife With Snake, కట్నం కోసం కాలనాగుతో భార్యను చంపిన భర్త

కట్టుకున్నవాడే కాలయముడైయ్యాడు. పెళ్లై ఓ బాబు పుట్టిన కట్నం డబ్బులపై మోజు తగ్గలేదు. అత్తారింటి నుంచి కాసులు రావని తెలిసి భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా పాముకాటుతో చంపించాడు. ఒకే నెలలో రెండు సార్లు పాము కాటు వేయడంతో అనుమానం వచ్చి యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.
కొల్లం జిల్లాలోని అంచల్ కు చెందిన సూరజ్, ఉత్రా భార్యభర్తలు. వీరికి వివాహమై రెండేళ్లయింది. వీరికి సంవత్సరం వయసున్న కొడుకు ఉన్నాడు. సూరజ్ ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నంతలో వీరి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఉన్నట్లుండి సూరజ్ కు మరింత కట్నంపై మోజు పడింది. దీంతో కట్నం కోసం ఉత్రాను కొన్ని నెలలుగా వేధించడం మొదలుపెట్టాడు. కానీ, ఆమె కుటుంబం నుంచి ఎటువంటి కట్నం వచ్చే అవకాశంలేదని గ్రహించిన సూరజ్.. ఉత్రాను అంతమొందించాలని డిసైడయ్యాడు. తన చేతులకు మట్టి అంటకుండా వదిలిచ్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం పక్కా ఫ్లాన్ రెడీ చేసుకున్నాడు.
తనకు తెలిసిన సురేష్ అనే పాములు పట్టే వ్యక్తికి రూ.పది వేలు చెల్లించి ఒక పామును కొన్నాడు. మార్చి నెలలో భార్య గదిలో నిద్రపోతుండగా.. పామును ఉత్రాపైకి వదిలాడు సూరజ్. పాము కాటు గమనించిన ఉత్రా వెంటనే తేరుకొని బంధువుల సాయంతో ఆస్పత్రికి చేరుకుంది. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఉత్రా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.
ఆ తర్వాత మే7న సూరజ్.. ఉత్రా దగ్గరకు వెళ్లాడు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత సూరజ్.. ఒక కోబ్రాను ఉత్రా మీదికి వదిలాడు. అది ఉత్రాను కాటేయడంతో ఆమె నిద్రలోనే చనిపోయింది. ఈ విషయం తెలియక ఉత్రా తల్లిదండ్రులు అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఉత్రా పాముకాటుతో చనిపోయినట్టు నిర్ధారించారు వైద్యులు. అక్కడే ఉన్న సూరజ్ తనకేమీ తెలియదన్నట్లుగా గదిలో ఉన్న పామును కర్రతో కొట్టి చంపాడు.
అయితే ఉత్రాకు రెండోసారి కూడా పాము కరవడంతో ఆమె తల్లిదండ్రులకు వారం తర్వాత అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సూరజ్ విచారించారు. దీంతో  అసలు విషయం బయటపడింది. సూరజ్ కట్నం కోసం ఈ హత్య చేశానని పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడు. ఉత్రాను చంపడానికి ఐదు నెలలుగా స్కెచ్ వేసినట్లు వివరించాడు. సూరజ్ కు సహకరించిన సురేష్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Tags