భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం.. 22 మంది మృతి..

Monsoon Rains: Red Alert In Kerala Districts, భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం.. 22 మంది మృతి..

కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా తలపిస్తున్నాయి. అంతేకాదు ప్రజలు భయటికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 200 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇప్పటికే వర్షాల కారణంగా వయనాడ్ నుంచి 22 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పద్నాలుగు జిల్లాల్లో పాఠశాలలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా కేరళ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. సీఎం సినరయి విజయన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులతో వరద పరిస్థితి పై సమీక్ష జరిపారు. ఇక ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *