Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి ఏపీలో పదో తరగతి విద్యార్థులు ఆల్ పాస్. ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్. పదో తరగతి విద్యార్ధులందర్ని పాస్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం. పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్ పొందిన ప్రతి ఒక్కరిని పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనరుకు ఆదేశాలు.
  • కరోనా టైం లో కంత్రీగాళ్ళు . కరోనా కు మందు అమ్మకాలు అంటూ మోసం . యాంటీ వైరల్ డ్రగ్ పేరిట దందా . 35 లక్షల విలువ చేసే యాంటీ వైరల్ డ్రగ్స్ స్వాధీనం . 8 మంది ని అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.
  • అమరావతి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా వ్యాప్తినిరోధక చర్యలు . పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యాలయానికి ఎవ్వరూ రావద్దని సర్కులర్ జారీ . విభాగాధిపతి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పీఆర్ఆర్డీ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు సిబ్బందికి ఆదేశాలు . ఆదేశాలు జారీ చేసింది ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ .
  • రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు . రుతుపవనాల కు తోడైన రెండు ఉపరితల ఆవర్తనాలు. వాయువ్య బంగాళాఖాతం , గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం -హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు.
  • శ్రీశైలం లో కరోనా కలకలం. ఆలయ ఉద్యోగులకు కూడా కరోనా సోకడంతో ఈరోజు నుంచి వారం రోజుల పాటు భక్తులందరికీ శ్రీశైలం ఆలయ దర్శనం నిలిపివేత. ఇప్పటికే ఎండోమెంట్ కమిషనర్, కర్నూలు కలెక్టర్ తో అనుమతి తీసుకున్న ఈఓ రామారావు.
  • బంజారాహిల్స్ లో 50 కోట్లు విలువైన లాండ్ కేసులో కొత్త కోణం . ఎకరా 20 గుంటలకు చెందినా ల్యాండ్ పత్రాలన్ని నకిలీవి గా తేల్చిన ఏసీబీ.  కోర్ట్ కి అందజేసిన పత్రాలు అన్ని ఫోర్జరీ , నకిలీ గా విచారణ లో వెల్లడి .

ఆకతాయిల క్రూరత్వానికి కడుపులో బిడ్డతో సహా ఏనుగు మృతి..!

కేరళ మలప్పురం దగ్గర్లోని ఓ గ్రామంలో కొందరు ఆకతాయిలు అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. మానవత్వం మరిచిపోయి గర్భంతో ఉన్న ఓ ఏనుగు చావుకు కారణమయ్యారు. ఆకలితో ఉన్న ఓ జంతువుకు ఆహారం ఆశచూపి.. దాని ప్రాణాలు తీశారు.
Kerala Elephant died Some of the youth given crackers loaded pineapple to elephant, ఆకతాయిల క్రూరత్వానికి కడుపులో బిడ్డతో సహా ఏనుగు మృతి..!

కేరళ మలప్పురం దగ్గర్లోని ఓ గ్రామంలో కొందరు ఆకతాయిలు అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. మానవత్వం మరిచిపోయి గర్భంతో ఉన్న ఓ ఏనుగు చావుకు కారణమయ్యారు. ఆకలితో ఉన్న ఓ జంతువుకు ఆహారం ఆశచూపి.. దాని ప్రాణాలు తీశారు. ఇంత జరిగినా ఎవరికీ అపకారం చేయకుండా.. బాధతో విలవిల్లాడిపోతూ అక్కడి నుంచి వెళ్లిపోయి నిలుచున్నచోటే ప్రాణాలు వదిలింది.
మానవత్వాన్ని మంటగల్పిన ఈ ఘటన గత నెలలో కేరళలో చోటు చేసుకొంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగుతో సైలెంట్‌ వ్యాలీ వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నదిపాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్‌ ఆశచూపారు. ఆ పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టారు. ఇది ఏమాత్రం తెలియని గజరాజు తినేసింది. దీంతో ఆ పండు భారీ చప్పుడుతో పేలింది. ఆ మూగజీవి నోటివెంట రక్తం ధారగా కారింది. రక్తమోడుతున్న నోటితో గ్రామం వదిలి వెళ్లిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండటంతో ఆకలి.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ.. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో.. ఏమి చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్‌ నదిలోకి దిగి గొంతు తడుపుకొంది.
విషయం తెలుసుకొన్న అటవీశాఖ సిబ్బంది.. సురేందర్‌, నీలకంఠన్‌ అనే మరో రెండు ఏనుగులను తీసుకొచ్చి దానిని బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. కానీ, గాయం బాధను తట్టుకోలేకపోతున్న ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది. చివరికి మే 27వ తేదీ సాయంత్రం 4గంటలకు తుదిశ్వాస విడిచింది. కేవలం పోకిరీలు చేసిన వెధవ పనికి నిండు గర్భంతో ఉన్న ఆ ఏనుగు ప్రాణాలు వదిలింది. హృదయ విదారకమైన ఈ ఘటనను మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్‌ కృష్ణన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో వెల్లడించారు. చనిపోయిన ఏనుగును బయటకు తీసుకొచ్చి దానిని పరీక్షించగా అది గర్భంతో ఉందని వైద్యులు తెలిపారు. చివరికి అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Related Tags