సాకర్ రారాజు మారడోనా మృతి.. రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేరళ సీఎం పినరయ్ విజయన్..

అర్జెంటినా సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా మృతికి కేరళ ప్రభుత్వం నివాళులర్పించింది. సాకర్‌లో లెజెండ్‌గా నిలిచిన మారడోనా గౌరవార్థం రెండు రోజుల పాటు సంతాప దినంగా ప్రకటింది.

  • Anil kumar poka
  • Publish Date - 5:08 pm, Thu, 26 November 20

అర్జెంటినా సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా మృతికి కేరళ ప్రభుత్వం నివాళులర్పించింది. సాకర్‌లో లెజెండ్‌గా నిలిచిన మారడోనా గౌరవార్థం రెండు రోజుల పాటు సంతాప దినంగా ప్రకటింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మారడోనా మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మారడోనాకు కేరళ రాష్ట్రంలో ఎంతోమంది అభిమానులు ఉన్నారని సీఎం పేర్కొన్నారు. సాకర్‌కు సంబంధించి ప్రపంచ కప్ మ్యాచ్ ఏది జరిగినా కేరళలోని చాలా చోట్ల మారడోనా పోస్టర్లే దర్శనమిస్తాయని విజయన్ చెప్పుకొచ్చారు. ఆయన మృతి సాకర్ అభిమానులకు తీరని లోటు అని అన్నారు.

కాగా, గుండెపోటు కారణంగా డీగో మారడోనా(60) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. మారడోనా మృతితో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సాకర్ రారాజుగా గుర్తింపు పొందిన ఆయన.. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మెదడులో రక్తం గడ్డ కట్టంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆయనను రక్షించారు. ఆ తరువాత పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మారడోనాకు.. బుధవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.