కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య

కేరళలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల దాటికి కొండచరియ విరిగిపడటంతో 17 మంది మరణించారు. మరికొంత మంది కొండ చరియల మట్టి దిబ్బల కింద..

కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 7:09 AM

కేరళలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల దాటికి కొండచరియ విరిగిపడటంతో 17 మంది మరణించారు. మరికొంత మంది కొండ చరియల మట్టి దిబ్బల కింద ఇరుక్కుపోయారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున ఇడుక్కి జిల్లాలోని పెట్టిముడి ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుల్లో ఎక్కువ మంది తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు కొండచరియలు తడిచి.. ఒక్క సారిగా కుప్పకూలాయి. అయితే ఆ కిందనే ఇళ్లు ఉండటంతో.. వాటిపై పడ్డాయి. దీంతో అందులో ఉన్న వారంతా మట్టిదిబ్బల కింద కూరుకుపోయారు. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా.. మరో 15 మందిని రెస్క్యూ టీం రక్షించింది. అయితే మట్టి దిబ్బల కింద ఇంకా యాభై మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వారి పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి.

కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే