స్పీడ్ పోస్టులో మంగళసూత్రం.. జూమ్ కాల్ లో వివాహ బంధం

కేరళకు చెందిన ఓ కపుల్.. తమ పెళ్లిని వెరైటీగా జరుపుకున్నారు. లాక్ డౌన్ అమల్లో ఉండగా తాము అనుకున్న తేదీకే ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. విఘ్నేష్, అంజలి రంజిత్ అనే ఈ జంట జూమ్ కాల్ ద్వారా ఒకింటివారయ్యారు. పుణేలో జాబ్ చేస్తున్న వీరు లాక్ డౌన్ కారణంగా కేరళ వెళ్లలేకపోవడంతో.. పుణెలోనే వివాహమాడారు. ప్రపంచ వ్యాప్తంగా వందమంది గెస్టులను ఈ కాల్ ద్వారా ఈ జంట ఆహ్వానించిందట. పెళ్ళికొడుకు విఘ్నేష్ ఫ్లాట్ లో అతని స్నేహితులు […]

స్పీడ్ పోస్టులో మంగళసూత్రం.. జూమ్ కాల్ లో వివాహ బంధం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 27, 2020 | 11:34 AM

కేరళకు చెందిన ఓ కపుల్.. తమ పెళ్లిని వెరైటీగా జరుపుకున్నారు. లాక్ డౌన్ అమల్లో ఉండగా తాము అనుకున్న తేదీకే ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. విఘ్నేష్, అంజలి రంజిత్ అనే ఈ జంట జూమ్ కాల్ ద్వారా ఒకింటివారయ్యారు. పుణేలో జాబ్ చేస్తున్న వీరు లాక్ డౌన్ కారణంగా కేరళ వెళ్లలేకపోవడంతో.. పుణెలోనే వివాహమాడారు. ప్రపంచ వ్యాప్తంగా వందమంది గెస్టులను ఈ కాల్ ద్వారా ఈ జంట ఆహ్వానించిందట. పెళ్ళికొడుకు విఘ్నేష్ ఫ్లాట్ లో అతని స్నేహితులు పూలదండలు, బొకేలు అందిస్తుండగా వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నారు. ఓ తమిళ మూవీ లోని’ మాంగల్యం తంతునామేనా’ అనే మంత్రాలను వీడియో ద్వారా వింటూ ఈ కపుల్ పెళ్లి చేసుకోవడం విశేషం. పైగా పెళ్ళికూతురికి ఆమె తలిదండ్రులు స్పీడ్ పోస్ట్ ద్వారా మంగళసూత్రాన్ని పంపారట, లాక్ డౌన్ నిబంధనలను కాస్త సడలించడంతో.. ఈ ‘తాళి’ సకాలంలో వీరికి చేరింది. ఇందుకు స్పీడ్ పోస్టును కొత్త జంట అభినందించింది. వధూవరుల తలిదండ్రులు కూడా జూమ్ కాల్ ద్వారానే ఈ వివాహాన్ని వీక్షించి ఆశీస్సులు అందజేశారు.